Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ 1st Test:తెలుగోడికి దక్కని చోటు.. శ్రేయస్ అయ్యర్ అరంగేట్రం..భారత్‌దే బ్యాటింగ్!

IND vs NZ 1st Test: Shreyas Iyer makes his debut, India opt to bat
Ind vs NZ 1st Test : Shreyas Iyer Debut | Kane ఆగయా | Siraj మిస్ || Oneindia Telugu

కాన్పూర్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా తాత్కలిక కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు. స్పిన్నర్ల ప్రభావం ఉండనున్న నేపథ్యంలో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్నాడని తెలిపాడు. ఇక తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్‌కు నిరాశే ఎదురైంది. అనుభవం కలిగిన సాహాకే టీమ్‌మేనేజ్‌మెంట్ ఓటేసింది. టీ20 సిరీస్‌లో గాయపడ్డ మహమ్మద్ సిరాజ్‌కు కూడా చోటు దక్కలేదు. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లు అవకాశం దక్కించుకున్నారు.

టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్ సవాల్‌తో కూడుకున్నది చెప్పాడు. అజాజ్ పటేల్, సోమర్ విల్లే బరిలోకి దిగుతున్నారని, రచిన్ రవీంద్ర అరంగేట్రం చేస్తున్నాడని చెప్పాడు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఓడించిన న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్‌ భావిస్తోంది. మరోవైపు కివీస్‌ కూడా టీ20 సిరీస్‌లో ఎదురైన క్లీన్‌స్వీప్‌ పరాభవాన్ని రూపుమాపేందుకు తొలి టెస్టులో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. అయితే ఈ సారి సీనియర్ల గైర్హాజరీలో భారత యువ జట్టు బరిలోకి దిగుతున్నది. కాగా భారత్‌ గడ్డపై కివీస్ చివరి సారిగా 1988లో టెస్టు మ్యాచ్ గెలిచింది.

తుది జట్లు:
భారత్: శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(కెప్టెన్‌) శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్

న్యూజిలాండ్‌: టామ్‌ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్‌), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్(వికెట్‌ కీపర్‌), రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, కైల్ జామీసన్, విలియం సోమర్‌విల్లే

Story first published: Thursday, November 25, 2021, 9:58 [IST]
Other articles published on Nov 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+