న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ 1st Test: అరంగేట్ర మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సెంచరీ.. ఆ వెంటనే ఔట్!

IND vs NZ 1st Test: Shreyas Iyer falls after hundred on Test debut

కాన్పూర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీ సాధించాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత బ్యాటింగ్‌తో అరుదైన ఫీట్ సాధించాడు. శుక్రవారం రెండో రోజు ఆట ప్రారంభమైన వెంటనే ధాటిగా ఆడిన అయ్యర్.. టిమ్ సౌథీ వేసిన ఇన్నింగ్స్ 91 ఓవర్ తొలికి బంతికి క్విక్ డబుల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన 16వ భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. శతకం కోసం 156 బంతులు ఆడిన శ్రేయస్ అయ్యర్.. 13 ఫోర్లు 2 సిక్సులు బాదాడు.

ఇక సొంతగడ్డపై సెంచరీ బాదిన 10వ ఆటగాడిగా అయ్యర్ గుర్తింపు పొందాడు. ఇక కాన్పూర్ వేదికగా అరంగేట్రం చేసి సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా కూడా అయ్యర్ ఘనతను అందుకున్నాడు. అంతకు ముందు గుండప్ప విశ్వనాథన్ కాన్పూర్‌లో అరంగేట్రం చేసి శతకం బాదాడు. న్యూజిలాండ్ జట్టుపై డెబ్యూ సెంచరీ చేసిన మూడవ బ్యాటర్‌గా అయ్యర్ రికార్డు సృష్టించాడు. కాగా, టీమ్ ఇండియా తరపున డెబ్యూ మ్యాచ్‌లో సెంచరీలు చేసిన చివరి ముగ్గురు బ్యాటర్లు కూడా ముంబైకి చెందిన వాళ్లే కావడం గమనార్హం. రోహిత్ శర్మ, పృథ్వీషా తర్వాత శ్రేయస్ అయ్యర్ ఆ జాబితాలో చేరాడు.

ఇక తొలి రోజు ఆటలో 145 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి అయ్యర్ ఆదుకున్నాడు. సూపర్ బ్యాటింగ్‌తో శతక భాగస్వామ్యం అందించి జట్టును మెరుగైన దశలో నిలిపాడు. రవీంద్ర జడేజా సైతం హాఫ్ సెంచరీ బాదడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 84 ఓవర్లలో 4 వికెట్లకు 258 రన్స్ చేసింది. అయ్యర్ 75 పరుగులు, జడేజా 50 పరుగులతో నిలిచారు.

258/4 ఓవర్ నైట్ స్కోర్‌‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ జోరు కొనసాగించలేకపోయింది. ఓవర్ నైట్ స్కోర్‌కు కేవలం 8 పరుగులు జోడించిన అనంతరం రవీంద్ర జడేజా (50) టిమ్ సౌథీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సాహ పూర్తిగా నిరాశ పరిచాడు. సాహ (1) టిమ్ సౌథీ బౌలింగ్‌లో బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సెంచరీ చేసిన వెంటనే అదే జోరులో చెత్తా షాట్‌తో అయ్యర్ ఔటయ్యాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో యంగ్‌కు క్యాచ్ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్(3) కూడా విఫలమయ్యాడు. సౌథీ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన టెయిలండర్ ఉమేశ్ యాదవ్‌తో అశ్విన్(26 బ్యాటింగ్) పోరాడుతున్నాడు.

Story first published: Friday, November 26, 2021, 11:01 [IST]
Other articles published on Nov 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X