న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ind vs Nz: టీఆర్‌పీ రేటింగ్స్ ఢమాల్.. రోహిత్, కోహ్లీ లేడు.. టెస్ట్ మ్యాచ్‌ను చూసెటోడే లేడు!

 IND vs NZ 1st Test Records Lowest TRP Ratings With Out Rohit Sharma And Virat Kohli

హైదరాబాద్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ తుది దశకు చేరుకుంది. అయితే ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన అయితే రావడం లేదు. టీఆర్‌పీ రేటింగ్స్, హాట్ స్టార్ వ్యూస్ దారుణంగా పడిపోయాయి. స్టార్ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్ పంత్ విశ్రాంతి నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు దూరమవడంతో ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్ ఓడిపోయిన ఫ్రస్టేషన్‌లో ఉన్న ఫ్యాన్స్ క్రికెట్ మ్యాచ్‌లను చూసేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దానికి తోడు టెస్ట్ క్రికెట్ అనే చులకన భావన కూడా అభిమానుల్లో నెలకొంది. దాంతో ఈ మ్యాచ్‌ వైపు ఎవరూ కన్నెత్తి చూడటం లేదు.

12 లక్షలు దాటలేదు..

12 లక్షలు దాటలేదు..

మాములుగా భారత్ మ్యాచ్ జరిగితే.. హాట్‌స్టార్‌లో సాధారణంగా 30 లక్షల నుంచి 40 లక్షల మంది చూస్తారు. ఆస్ట్రేలియా పర్యటన, ఇంగ్లండ్ పర్యటనలో జరిగిన టెస్ట్ సిరీస్ యావరేజ్‌గా 25-30 లక్షల మంది చూశారు. కానీ తాజాగా జరుగుతున్న భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ ఏ దశలోనూ 12 లక్షల ధాటలేదు. తొలి రోజు అయితే ఓ దశలో 3 లక్షల మందే చూశారు. నాలుగో రోజు ఆదివారం కావడంతో ఈ సంఖ్య కాస్త మెరుగై 11 లక్షలకు చేరింది. హాట్ స్టార్ వ్యూసే ఇంత దారుణంగా పడిపోతే.. ఇక టీవీల్లో వీక్షించే వారి సంఖ్య ఇంకా తక్కువగా ఉంటుందని టీవీ విశ్లేషకులు అంటున్నారు.

చప్పగా సాగడంతో..

స్టార్ ఆటగాళ్లంతా విశ్రాంతి తీసుకోవడం.. ఉన్న ఆటగాళ్లు పెద్దగా రాణించకపోవడం కూడా రేటింగ్‌పై ప్రభావం చూపినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా భారత బ్యాటింగ్‌లో శ్రేయస్ అయ్యర్ మినహా ఎవరూ రాణించకపోవడం కూడా ప్రేక్షకులకు చికాకు తెప్పించింది. పైగా బ్యాటింగ్‌ ట్రాక్‌పై ఆటగాళ్లు నిదానంగా ఆడటం.. బోర్ కొట్టించింది. ఇక రోహిత్, కోహ్లీ లేకపోవడంతో వారి అభిమానులు ఈ మ్యాచ్‌ను పట్టించుకోవడమే మానేసారు. దాంతో టీఆర్‌పీ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. మొత్తానికి ఈ సిరీస్‌తో స్టార్ స్పోర్ట్స్‌కు నష్టాలే మిగిలాయి.

250 ప్లస్ ఆధిక్యంలో భారత్..

250 ప్లస్ ఆధిక్యంలో భారత్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్ర ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకే ఆలౌటవ్వడంతో భారత్‌కు 49 పరుగుల ఆధిక్యం లభించింది. అక్షర్ పటేల్‌ 5 వికెట్లతో చెలరేగగా.. అశ్విన్ మూడు వికెట్లతో రాణించాడు. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్ 51 పరుగులకే 5 వికెట్ల కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ పరిస్థితిల్లో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ మరోసారి ఆదుకున్నాడు. దాంతో డ్రింక్స్ సమయానికి 75 ఓవర్లలో 7 వికెట్లకు 206 పరుగులు చేసింది. దాంతో భారత్ 255 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Story first published: Sunday, November 28, 2021, 16:07 [IST]
Other articles published on Nov 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X