For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: ‘పాకిస్థాన్ ముర్దాబాద్’.. ‘భారత్ మాతా కీ జై’నినాదాలతో దద్దరిల్లిన కాన్పూర్ మైదానం! (వీడియో)

IND vs NZ 1st Test: Kanpur Crowd chants ‘Pakistan Murdabad’ during 1st day’s play

కాన్పూర్: రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ తొలి రోజు ఆటలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలతో కాన్పూర్ మైదానం దద్దరిల్లింది. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి అభిమానులు 'పాకిస్థాన్ ముర్దాబాద్', భారత్ మాతా కీ జై, వందేమాతరం అంటూ గట్టిగా నినాదాలు చేశారు.తమ స్లోగన్స్‌తో భారత్ ఆటగాళ్లను ఉత్తేజపరిచారు. జీతేగా భాయ్ జీతేగా ఇండియా జితేగా అంటూ గట్టిగా అరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..

టాస్ గెలిచిన టీమిండియా తాత్కలిక కెప్టెన్ అజింక్యా రహానే బ్యాటింగ్‌ ఎంచుకోగా.. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఇక కైల్ జెమీసన్ వేసిన 6వ ఓవర్ సమయంలో గ్యాలరీలోని ప్రేక్షకులు గట్టిగా నినాదాలు చేశారు. 2016 తర్వాత మళ్లీ ఈ మైదానంలో టెస్ట్ మ్యాచ్ జరగడం ఇదే తొలి సారి కావడంతో ఈ మ్యాచ్‌కు భారీ ఎత్తున ప్రేక్షకులు హాజరయ్యారు. భారత జట్టును ఉత్సాహపరిచేలా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కొందరూ పాకిస్థాన్ ముర్తాబాద్ అంటూ స్లోగన్స్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.

భారత్‌దే ఆధిపత్యం..

భారత్‌దే ఆధిపత్యం..

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆటలో భారత్ ఆధిపత్యం చెలాయించింది. సెకండ్ సెషన్‌లో తడబడినా.. అరంగేట్ర ప్లేయర్ శ్రేయస్ అయ్యర్(136 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 75 బ్యాటింగ్), రవీంద్ర జడేజా(100 బంతుల్లో 6 ఫోర్లతో 50 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.

మయాంక్ అగర్వాల్(13), చతేశ్వర్ పుజారా(26), అజింక్యా రహానే(35) విఫలమైనా.. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(93 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక బ్యాడ్ లైట్ కారణంగా మరో 6 ఓవర్ల ఆట మిగిలుండగానే అంపైర్లు ఆటను నిలపేసారు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జెమీసన్ మూడు వికెట్లతో చెలరేగగా.. టీమ్ సౌథీ ఓ వికెట్ తీశాడు.

అయ్యర్, జడేజా జోరు..

అయ్యర్, జడేజా జోరు..

145 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును అరంగేట్ర ప్లేయర్ శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా ఆదుకున్నాడు. 113 పరుగుల అజేయ భాగస్వామ్యంతో జట్టును మంచి స్థితిలో నిలిపారు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి స్మార్ట్ బ్యాటింగ్‌తో పరుగులు చేశారు. మంచి బంతులను గౌరవిస్తూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలోనే టీమ్ సౌథీ వేసిన 68వ ఓవర్ తొలి బంతికి క్విక్ సింగిల్ తీసిన అయ్యర్.. 94 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. దాంతో అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ బాదిన క్రికెటర్ల జాబితాలో అయ్యర్ చోటు దక్కించుకున్నాడు.

అనంతరం వేగం పెంచిన అయ్యర్.. అజాజ్ పటేల్ వేసిన 75వ ఓవర్‌లో ఓ సిక్స్, ఫోర్ బాదాడు. ఇక జెమీసన్ వేసిన 84వ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన జడేజా.. సౌథీ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం బ్యాట్‌ను కత్తిసాములా తిప్పుతూ.. తన ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. సోమర్ విల్లే వేసిన ఆ మరుసటి ఓవర్‌లో అయ్యర్ భారీ సిక్సర్ బాదగా.. ఈ ఓవర్ అనంతరం బ్యాడ్ లైట్‌తో తొలి ఆట ముగిసింది.

Story first published: Thursday, November 25, 2021, 18:19 [IST]
Other articles published on Nov 25, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+