For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: ఆ స్పిన్నర్‌పై వేటు.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌‌లో అనూహ్య పరాజయాన్ని ఎదుర్కొన్న టీమిండియా.. టీ20 సిరీస్‌కు సిద్దమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు టీమిండియా ఆడుతున్న ఆఖరి ద్వైపాక్షిక సిరీస్ ఇదే కావడంతో ఈ టీ20 సమరంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాగ్‌పూర్ వేదికగా బుధవారం జరిగే తొలి మ్యాచ్‌తో ఈ ఐదు టీ20ల సిరీస్‌కు తెరలేవనుంది.

ఇప్పటికే టీ20 ప్రపంచకప్ సంబంధించిన కాంబినేషన్‌ను టీమిండియా మేనేజ్‌మెంట్ సిద్దం చేసుకుంది. కానీ ఈ టీ20 సిరీస్‌కు ముందు తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ గాయాలతో దూరమవ్వడం జట్టుకు తలనొప్పిగా మారింది. వారి స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్ తాత్కలికంగా అవకాశం అందుకోగా.. వారిని బ్యాకప్‌గా రెడీ చేయాల్సిన బాధ్యత టీమ్‌మేనేజ్‌మెంట్‌పై పడింది. దాంతో తొలి టీ20లో బరిలోకి దిగే భారత తుది జట్టు కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

IND vs NZ 1st T20I Kuldeep Yadav Likely to Miss Out as Team Prefers Balanced Combination

కుల్దీప్ యాదవ్‌పై వేటు..

వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ ఈ ఐదు టీ20ల సిరీస్‌‌లో ఆడనున్నారు. ఈ ముగ్గురి రాకతో బలహీనంగా ఉన్న భారత బౌలింగ్ భీకరంగా మారనుంది. అయితే స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్‌లను తుది జట్టులో ఆడించలేని పరిస్థితి నెలకొంది. ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగితే బ్యాటింగ్ విభాగం బలహీనంగా మారనుంది.

ఈ క్రమంలోనే కుల్దీప్ యాదవ్‌పై వేటు పడనుంది. ఒకవేళ నాగ్‌పూర్ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటే.. టీమిండియా ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగనుంది. అప్పుడు హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లో ఒకరు బెంచ్‌కే పరిమితం కానున్నారు.

అయ్యర్ x ఇషాన్..

గాయంతో దూరమైన తిలక్ వర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లో ఒకరు బరిలోకి దిగనున్నారు. టీమ్‌మేనేజ్‌మెంట్ అయ్యర్‌కు అవకాశం ఇస్తుందా? లేక టీ20 ప్రపంచకప్ జట్టులో భాగంగా ఉన్న ఇషాన్ ఆడిస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయ్యర్‌ను ఆడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

శివమ్ దూబే x రింకూ సింగ్..

టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే, ఫినిషర్ రింకూ సింగ్‌లో ఒకరే ఆడనున్నారు. బౌలింగ్, బ్యాటింగ్ డెప్త్ కోసం శివమ్ దూబేనే ఆడించవచ్చు. మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఈ ఇద్దరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో ఆడనుండగా.. శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో బరిలోకి దిగనున్నాడు.

ఐదో స్థానంలో హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనుండగా.. ఆరో స్థానంలో శివమ్ దూబే, ఏడో స్థానంలో అక్షర్ పటేల్‌ ఆడనున్నాడు.పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఆడనున్నారు.

న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు(అంచనా)

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్/ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే/రింకూ సింగ్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా/కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి,


న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం భారత జట్టు:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (మొదటి మూడు టీ20లకు), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్.

Story first published: Wednesday, January 21, 2026, 7:10 [IST]
Other articles published on Jan 21, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+