For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ind vs Nz 1st T20: రోహిత్ సేనకు తొలి పరీక్ష! శుభారంభం దక్కెనా?

Ind vs Nz 1st T20: India eye a fresh start with Rohit and Dravid taking charge

జైపూర్: టీ20 ప్రపంచకప్‌లో కనీసం సెమీచేరకుండానే ఇంటిదారి పట్టి తీవ్రంగా నిరాశపర్చిన టీమిండియా మరో సవాల్‌కు సిద్దమైంది. కొత్త కెప్టెన్, కొత్త కోచ్, కొత్త కుర్రాళ్లతో 2022 టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా సరికొత్త ప్రయాణం మొదలుపెట్టనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగే ఫస్ట్ టీ20లో బలమైన న్యూజిలాండ్‌తో తలపడనుంది. టీ20 ప్రపంచకప్ రన్నరప్ కివీస్ జోరు మీదుండగా.. టీ20 ఫార్మాట్ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ, కొత్త హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో టీమిండియా చేయబోయే పెర్ఫామెన్స్‌పై అందరి దృష్టి నెలకొంది. రోహిత్ గతంలో పలు మార్లు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

గత శ్రీలంక పర్యటనలో ద్రవిడ్ కూడా భారత్ కోచ్‌గా పనిచేశాడు. కానీ వీరిద్దరూ ఇప్పుడు పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టగా.. తొలి పరీక్షను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. తొలి పోరులోనే గెలిచి సిరీస్‌ పట్టు సాధించాలని భావిస్తున్న రోహిత్ సేన.. టీ20 ప్రపంచకప్‌లో కివీస్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని చూస్తొంది. కోహ్లీ సహా పలువురు సీనియర్ల గైర్హాజరీలో చాన్నాళ్ల తర్వాత సొంతగడ్డపై ఆడుతున్న ఈ సిరీస్ ఫలితం భారత్‌కు కీలకం.

టీమ్ కాంబినేషన్..

టీమ్ కాంబినేషన్..

ఏడాదిలోపే ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో.. ఆస్ట్రేలియాలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లు ఏ మేర ఉపయోగపడతారో అంచనా వేయనున్నారు కోచ్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌. ఇప్పుడు జట్టులో ఐదుగురు ఓపెనర్లు ఉన్నారు. కొందరికి మిడిల్‌ ఆర్డర్‌ స్థానాలు కేటాయించడం సవాలే. రోహిత్‌, రాహుల్‌ తొలి టీ20లో ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశాలు ఎక్కువ. వెంకటేశ్‌ అయ్యర్‌ కూడా ఓపెనర్‌గానే ఐపీఎల్‌లో సత్తా చాటాడు. ఇప్పుడు అతడు మిడిల్‌ ఆర్డర్‌లో రానున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ నాలుగో స్థానంలో వస్తాడు. ప్రపంచకప్‌లో ఆకట్టుకోలేకపోయిన అతను.. ఈసారి చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌, పంత్‌లతో భారత లైనప్‌ పేపర్‌పై బలంగా కనిపిస్తోంది. రవీంద్ర జడేజా గైర్హాజరీలో అక్షర్‌ పటేల్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ పాత్రను పోషించనున్నాడు. యూఏఈలో రాణించిన అశ్విన్‌ తుది జట్టులో స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశముంది. దీపక్‌ చాహర్‌, చాహల్‌ కూడా బరిలోకి దిగడం ఖాయం.

కేన్ మామ దూరం..

కేన్ మామ దూరం..

మరోవైపు న్యూజిలాండ్‌ జట్టు ఫైనల్లో ఓడిన 24 గంటల్లోపు సిరీస్‌ ఆడేందుకు సోమవారం సాయంత్రం జైపూర్‌లో దిగింది. టెస్టు సిరీస్‌కు ముందు తగినంత విశ్రాంతి కోరుకుంటున్న కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ టి20 సిరీస్‌ నుంచి దూరమవుతున్నట్లు ప్రకటించాడు. దాంతో సారథిగా టిమ్‌ సౌథీ వ్యవహరిస్తాడు. బౌల్ట్‌ కూడా టీమ్‌లో లేకపోగా... కాన్వే, ఫెర్గూసన్‌ ఇంకా గాయాల నుంచి కోలుకుంటున్నారు. వరల్డ్‌కప్‌ ఆడని వారిలో కొత్తగా మార్క్‌ చాప్‌మన్, కైల్‌ జేమీసన్‌ ఈ సిరీస్‌లో బరిలోకి దిగనున్నారు. సోధి, శాంట్నర్‌ల రూపంలో మంచి స్పిన్నర్లూ ఉన్నారు. విలియమ్సన్‌ లేకున్నా కివీస్‌ బ్యాటింగ్‌ కూడా బాగానే ఉంది. ప్రమాదకర ఓపెనర్‌ మిచెల్‌ ఫామ్‌ ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

పిచ్ రిపోర్ట్:

పిచ్ రిపోర్ట్:

జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం ఇంతకుముందెప్పుడూ టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వలేదు. ఇక్కడ చివరిసారి 2013లో అంతర్జాతీయ మ్యాచ్‌ జరిగింది. తొలి టీ20 కోసం సిద్ధం చేసిన పిచ్‌పై భారీ స్కోర్లు నమోదవుతాయని భావిస్తున్నారు. చివరగా 2019 ఐపీఎల్‌లో ఇక్కడ జరిగిన టీ20 మ్యాచ్‌లో మంచి స్కోర్లు వచ్చాయి. మైదానం పెద్దది కావడం స్పిన్నర్లకు అడ్వాంటేజ్ కానుంది. మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి టాస్ కీలకం కానుంది.

తుది జట్లు(అంచనా)

తుది జట్లు(అంచనా)

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్/ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్/రుతురాజ్ గైక్వాడ్, రిషభ్ పంత్(కీపర్), వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్/రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చాహర్/భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ సిరాజ్/ఆవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్

న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, గ్లేన్ ఫిలిప్స్, చాప్‌మన్, టీమ్ సీఫెర్ట్(కీపర్), జిమ్మీ నీషమ్, సాంట్నర్, జెమీసన్, టీమ్ సౌథీ(కెప్టెన్), మిల్నే/ఫెర్గూసన్, ఇష్ సోధీ

Story first published: Wednesday, November 17, 2021, 8:41 [IST]
Other articles published on Nov 17, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+