For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ 1st semi-final: శతక్కొట్టిన కోహ్లీ, అయ్యర్.. న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యం!

IND vs NZ 1st semi-final: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో కివీస్ బౌలర్లను చెడుగుడు ఆడారు. విరాట్ కోహ్లీ(113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 117) రికార్డ్ సెంచరీ‌తో సత్తా చాటగా .. శ్రేయస్ అయ్యర్(70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 105) విధ్వంసకర సెంచరీ బాదాడు.

దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(66 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80 నాటౌట్), రోహిత్ శర్మ(29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్ ఓ వికెట్ పడగొట్టాడు.

IND vs NZ 1st semi-final: Virat Kohli, Iyer and Rohit power India to 397/4

రోహిత్ విధ్వంసకర ఆరంభం..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. తనకే సాధ్యమైన ట్రేడ్ మార్క్ పుల్ షాట్లతో వేగంగా పరుగులు రాబట్టాడు. రోహిత్ ధాటికి టీమిండియా 5.2 ఓవర్లలోనే 50 పరుగులు పూర్తి చేసుకుంది.

శుభ్‌మన్ హాఫ్ సెంచరీ..
హాఫ్ సెంచరీకి చేరువైన రోహిత్ శర్మ(47)ను టీమ్ సౌథీ క్యాచ్ ఔట్ చేయడంతో తొలి వికెట్‌కు నమోదైన 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సౌథీ వేసిన బంతి కోహ్లీ ప్యాడ్లకు తాకగా.. న్యూజిలాండ్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు.

ఫీల్డ్ అంపైర్ ఔటివ్వకపోవడంతో రివ్యూ తీసుకున్నారు. కానీ రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కోహ్లీతో కలిసి శుభ్‌మన్ గిల్ ధాటిగా ఆడాడు. 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శుభ్‌మన్ గిల్.. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. సెంచరీ దిశగా సాగిన శుభ్‌మన్ గిల్ క్రాంప్స్‌తో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. పరుగెత్తలేకపోయిన గిల్.. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.

విరాట్ రికార్డ్ సెంచరీ..
దాంతో క్రీజులోకి అయ్యర్ రాగా.. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాస్త నిదానంగా ఆడిన ఈ జోడీ.. సెట్ అయిన అనంతరం చెలరేగింది. గేర్ మార్చిన కోహ్లీ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఓవైపు క్రాంప్స్ ఇబ్బంది పెట్టినా.. 106 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విరాట్‌కు ఇది 50వ వన్డే సెంచరీ. శతకం అనంతరం భారీ షాట్ ఆడే ప్రయత్నంలో కోహ్లీ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

IND vs NZ 1st semi-final: Virat Kohli, Iyer and Rohit power India to 397/4

క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్‌(39 నాటౌట్)తో కలిసి ధాటిగా ఆడిన శ్రేయస్ అయ్యర్.. 67 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. చివర్లో ధాటిగా ఆడే క్రమంలో శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగారు. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన శుభ్‌మన్ గిల్ క్రీజులోకి రాగా.. రాహుల్ సిక్సర్‌తో పాటు రెండు బౌండరీలు బాదడంతో టీమిండియా 397 పరుగుల భారీ స్కోర్ అందుకుంది.

Story first published: Wednesday, November 15, 2023, 17:59 [IST]
Other articles published on Nov 15, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+