For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ 1st semi-final: భరించలేని ఉక్కపోత.. శుభ్‌మన్ గిల్ రిటైర్డ్ హర్ట్! (వీడియో)

IND vs NZ 1st semi-final: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సెంచరీ దిశగా సాగుతున్న శుభ్‌మన్ గిల్‌కు నరం పట్టేయడంతో అర్థాంతరంగా మైదానం వీడాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అదిరిపోయే ఆరంభాన్ని అందించిన శుభ్‌మన్ గిల్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి మంచి టచ్‌లో కనిపించాడు.

కోహ్లీతో కలిసి సాధికారిక ఇన్నింగ్స్ ఆడిన శుభ్‌మన్ సునాయసంగా సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ ఇన్నింగ్స్ 23వ ఓవర్‌లో క్రాంప్స్ కారణంగా పరుగెత్త లేకపోయిన శుభ్‌మన్.. నరం పట్టేయడంతో మైదానంలో కుప్పకూలాడు. తీవ్ర ఉక్కపోతగా ఉండే ముంబైలో సుదీర్ఘ సమయం బ్యాటింగ్ చేయడంతో శుభ్‌మన్ గిల్‌కు క్రాంప్స్‌ వచ్చాయి.

IND vs NZ 1st semi-final: Shubman Gill Retired Hurt After 65-Ball 79

భరించలేని నొప్పి ఉండటంతో ఫిజియోల సూచన మేరకు మైదానం వీడాడు. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన శుభ్‌మన్ గిల్‌కు మళ్లీ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. వికెట్ పడిన తర్వాత అతను ఎప్పుడైనా బ్యాటింగ్‌కు రావచ్చు. సెంచరీకి 21 పరుగుల దూరంలో ఉన్న శుభ్‌మన్ గిల్ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి శతకం పూర్తి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

శుభ్‌మన్ గిల్ మైదానం వీడటంతో శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి రాగా.. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శరీరంలో ఉన్న నీరు శాతం తగ్గినప్పుడు క్రాంప్స్ వస్తాయి. అందుకే ఫిజియోలు ఆటగాళ్లకు సాల్ట్ వాటర్ తాగిస్తారు. సముద్ర తీరం కలిగిన చెన్నై, ముంబై మైదానాల్లో ఆటగాళ్ల తరుచూ క్రాంప్స్‌తో ఇబ్బంది పడుతారు.

అఫ్గానిస్థాన్‌తో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ హిట్టర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ క్రాంప్స్‌తో బాధపడుతూనే డబుల్ సెంచరీ చేశాడు. ఒకానోక సమయంలో మ్యాక్సీ సైతం గిల్ తరహాలో నొప్పిని భరించలేక నేలపై పడుకున్నాడు. ఆ తర్వాత సింగిల్స్ తీయకుండా కేవలం హిట్టింగ్ మాత్రమే చేశాడు.

ఇక ఈ మ్యాచ్‌కు శుభ్‌మన్ గిల్ తల్లిదండ్రులు హాజరవ్వగా.. వారి ముందు గొప్ప ఇన్నింగ్స్ ఆడాలని గిల్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. తన టార్గెట్‌కు 21 పరుగుల దూరంలో మైదానం వీడాడు.

Story first published: Wednesday, November 15, 2023, 16:27 [IST]
Other articles published on Nov 15, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+