వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌కు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ హాజరయ్యింది. స్టాండ్స్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి టీమిండియా బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తోంది. టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బౌండరీ బాదిన ప్రతీసారి టీవీ కెమెరామెన్ సారా టెండూల్కర్‌ను చూపిస్తున్నాడు.
ఈ ఇద్దరి దాగుడుమూతల ప్రేమను కెమెరామెన్ బయటపెట్టేస్తున్నాడు. దాంతో సోషల్ మీడియా వేదికగా మరోసారి శుభ్‌మన్ గిల్-సారా టెండూల్కర్ లవ్ గాసిప్స్ గుప్పుమన్నాయి. ప్రపంచకప్‌లో పుణే, ముంబై వేదికగా టీమిండియా ఆడిన ప్రతీ మ్యాచ్‌కు హాజరైన సారా టెండూల్కర్.. అతని బ్యాటింగ్‌ను తెగ ఎంజాయ్ చేసింది.

శుభ్‌మన్ గిల్.. సిక్స్, ఫోర్ కొట్టిన ప్రతీసారి చప్పట్లతో సంతోషం వ్యక్తం చేసింది. అతను ఔటైన సందర్బాల్లో నొచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం నిజమేననే అభిప్రాయం అభిమానులకు కలిగింది.
అంతేకాకుండా జియో ప్లాజా ఓపెనింగ్ కార్యక్రమంలో ఈ ఇద్దరూ కలుసుకోవడం కూడా ఈ ప్రచారానికి ఊతం ఇచ్చింది. బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ సైతం శుభ్‌మన్ గిల్ జీవితంలో ఉన్న సారా తాను కాదని, మరొకరని తెలిపింది. దాంతో శుభ్‌మన్ గిల్, సారా ప్రేమాయణం నిజమేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ వార్తలపై ఇరు కుటుంబాలు మౌనంగా ఉండటం కూడా ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం నిజమేనని నమ్మేలా చేస్తోంది.
తాజా సెమీఫైనల్ మ్యాచ్‌లోనూ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ చేయగానే కెమెరా సారా టెండూల్కర్ వైపు చూపించారు. ఈ ఇద్దరి ప్రేమాయణంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వారి సీక్రెట్ లవ్‌ను కెమెరామెన్ బయటపెట్టేస్తున్నాడని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. తనకే సాధ్యమైన ట్రేడ్ మార్క్ షాట్లతో సిక్సర్లు బాదాడు. ఓ వైపు రోహిత్ ధాటిగా ఆడగా.. శుభ్‌మన్ గిల్ యాంకర్ రోల్ పోషించాడు. హాఫ్ సెంచరీకి చేరువైన రోహిత్ శర్మను టీమ్ సౌథీ క్యాచ్ ఔట్‌గా బోల్తా కొట్టించాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి వచ్చిన కోహ్లీ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శుభ్‌మన్ గిల్.. ధాటిగా ఆడుతూ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.