Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ 1st semi-final: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. !

CWC 2023, IND vs NZ 1st semi-final: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) చరిత్ర సృష్టించాడు. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక సిక్స్‌లు బాదిన ప్లేయర్‌గా రికార్డ్ సాధించాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో ముంబై వేదికగా జరుగుతున్న తొలి సెమీఫైనల్లో 4 సిక్స్‌లు బాదిన రోహిత్.. అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు.

2015, 2019, 2023వన్డే ప్రపంచకప్‌లు మాత్రమే ఆడిన రోహిత్ శర్మ 51 సిక్సర్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా 48 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచకప్‌లో 50 సిక్స్‌లు బాదిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.

IND vs NZ 1st semi-final: Rohit Sharma becomes first to hit 50 sixes in 48 years World Cup history

గేల్ ప్రపంచకప్‌ల్లో 49 సిక్స్‌లు కొట్టగా.. 51 సిక్స్‌లతో రోహిత్ అధిగమించాడు. గ్లేన్ మ్యాక్స్‌వెల్(43), ఏబీ డివిలియర్స్(37), డేవిడ్ వార్నర్‌(37)లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక సింగిల్ ఎడిషన్ ప్రపంచకప్‌లోనూ అత్యధిక సిక్స్‌లు బాదిన ప్లేయర్‌గా రోహిత్ శర్మ రికార్డ్ సాధించాడు. తాజా ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 27 సిక్స్‌లు బాదిన రోహిత్ శర్మ.. క్రిస్ గేల్ రికార్డ్‌ను అధిగమించాడు.

2019 వన్డే ప్రపంచకప్‌లో క్రిస్ గేల్ 26 సిక్స్‌లు బాదగా.. రోహిత్ 27 సిక్స్‌లతో బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో ఇయాన్ మోర్గాన్(22), గ్లేన్ మ్యాక్స్‌వెల్(22), ఏబీ డివిలియర్స్(21), క్వింటన్ డికాక్(21) తర్వాత స్థానాల్లో ఉన్నారు. సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ రికార్డ్ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. తనకే సాధ్యమైన ట్రేడ్ మార్క్‌ షాట్లతో సిక్సర్లు బాదాడు. ఓ వైపు రోహిత్ ధాటిగా ఆడగా.. శుభ్‌మన్ గిల్ యాంకర్ రోల్ పోషించాడు. హాఫ్ సెంచరీకి చేరువైన రోహిత్ శర్మను టీమ్ సౌథీ క్యాచ్ ఔట్‌గా బోల్తా కొట్టించాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

Story first published: Wednesday, November 15, 2023, 14:58 [IST]
Other articles published on Nov 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+