Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ 1st semi-final: హాట్‌స్టార్ వరల్డ్ రికార్డ్!

IND vs NZ 1st semi-final: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) డిజిటల్ బ్రాడ్‌కాస్టర్ డిస్నీహాట్ స్టార్ చరిత్ర సృష్టించింది. క్రీడల చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న తొలి సెమీఫైనల్లో హాట్‌స్టార్ రికార్డు రియల్ టైమ్ వ్యూస్‌ను రాబట్టింది.

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్ నమోదు చేయడం హాట్ స్టార్‌కు శతకొచ్చింది. వన్డే క్రికెట్‌లో 50వ శతకం నమోదు చేసిన కింగ్ కోహ్లీ.. ఈ ఘనతను సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డ్‌ను అధిగమించాడు. 50వ సెంచరీ పూర్తయిన క్షణాన హాట్ స్టార్ రియల్ టైమ్ వ్యూస్ 5 కోట్లకు చేరింది.

IND vs NZ 1st semi-final: Disney Hotstar creates new viewership record during Virat Kohli’s batting

సెంచరీ పూర్తయిన వెంటనే మొకారిల్లిన కోహ్లీ.. సంచిన్ టెండూల్కర్‌కు అభివాదం చేయడంతో పాటు తన సతీమణి అనుష్క శర్మ వైపు చూస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఈ క్షణాన హాట్ స్టార్ రియల్ టైమ్ వ్యూస్ 5 కోట్లకు చేరింది.

ఏ దశలోనూ ఈ వ్యూస్ 4 కోట్లకు తగ్గలేదు. ఇదే వన్డే ప్రపంచకప్‌లో భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో గరిష్టంగా 4.4 కోట్ల రియల్ టైమ్ వ్యూస్ నమోదైంది. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా తాజా మ్యాచ్‌లో బద్దలయ్యింది.

ఈ సారి సబ్‌స్క్రిప్షన్ లేకుండా హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లు చూసే అవకాశం కల్పించడంతో ఈ రికార్డు వ్యూస్ నమోదు అయ్యాయి. జియో సినిమా దెబ్బకు హాట్‌స్టార్ ఆసియాకప్‌తో పాటు ప్రపంచకప్‌ మ్యాచ్‌లను సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా చూసే ఆస్కారం కల్పించింది. ఒకవేళ భారత్ ఫైనల్ చేరితే.. ఈ రికార్డు కూడా బద్దలయ్యే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 117), శ్రేయస్ అయ్యర్(70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 105) శతకాలతో రాణించారు.

Story first published: Wednesday, November 15, 2023, 20:22 [IST]
Other articles published on Nov 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+