Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NEP: సిరాజ్.. ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకో!

పల్లెకెలె: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసియాకప్ 2023లో భాగంగా పసికూన నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్ హద్దులు ధాటి ప్రవర్తించాడు. నేపాల్ ఓపెనర్ కుషాల్ భ్రుటేల్‌పైకి హైదరాబాద్ పేసర్ స్లెడ్జింగ్‌కు దిగాడు.
సిరాజ్ వేసిన 6వ ఓవర్‌లో భ్రుటెల్ వరుసగా 4, 6 కొట్టాడు.

దాంతో తీవ్ర అసహనానికి గురైన సిరాజ్.. మరుసటి బంతిని 147 కిలోమీటర్ల వేగంతో బౌన్సర్ సంధించాడు. ఈ బంతిని భ్రుటెల్ ఆడలేక వదిలేసాడు. దాంతో బంతి అతని చెవుల పక్కనుంచి రివ్వున కీపర్ చేతుల్లోకి దూసుకెళ్లింది. వెంటనే సిరాజ్.. భ్రుటెల్ దగ్గరకు వచ్చి 'ఏమైంది.. ఈ బంతికి సిక్స్ కొట్టలేదేంది?'అని కవ్వించాడు.

Fans slams Mohammed Siraj

చాలా సీరియస్‌గా అతనివైపు చూసాడు. ఆ తర్వాత కూడా 142 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. అయితే పసికూన నేపాల్‌పై సిరాజ్ ప్రతాపం ఏందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దమ్ముంటే పాకిస్థాన్‌పై ఈ దూకుడు చూపించాలని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెడుతున్న నేపాల్ బ్యాటర్లను ప్రశంసించాల్సింది పోయే స్లెడ్జింగ్‌కు దిగుతావా? అని మండిపడుతున్నారు.

ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకోవాలని సిరాజ్‌కు చురకలంటిస్తున్నారు. ప్రస్తుతం సిరాజ్-భ్రుటేల్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు. ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అతని ఓవర్‌లో ఓపెనర్ ఆసిఫ్ షేక్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను షార్ట్ కవ‌ర్‌లో ఉన్న కోహ్లీ నేలపాలు చేశాడు.

ఈ క్యాచ్ నేలపాలు కావడంతో ఫ్రస్టేషన్‌కు గురైన సిరాజ్.. పదే పదే బౌన్సర్లు సంధించి పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా.. నేపాల్‌ బ్యాటింగ్‌కు దిగింది. భారత ఆటగాళ్ల తప్పిదాలతో చెలరేగిన నేపాల్ ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. తొలి 6 ఓవర్లలోనే భారత ఆటగాళ్లు మూడు క్యాచ్‌లు నేలపాలు చేశారు.

ఇక తొలి వికెట్‌కు 65 పరుగులు జోడించిన అనంతరం కుశాల్ భ్రుటెల్‌(38)ను శార్దూల్ ఠాకూర్ పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన భీమ్ షక్రీ(7), రోహిత్ పౌడెల్(5), కుశాల్ మల్లా(2)లను జడేజా ఔట్ చేశాడు. హాఫ్ సెంచరీ సాధించిన ఆసిఫ్ షేక్(58)ను సిరాజ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నేపాల్ 132 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది.

Story first published: Monday, September 4, 2023, 17:20 [IST]
Other articles published on Sep 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+