IND vs NED: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తీ.. వరుస వికెట్లతో వరల్డ్ రికార్డ్!
టీమిండియా స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా అత్యధిక మ్యాచ్‌ల్లో వికెట్లు తీసిన తొలి భారత స్పిన్నర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ రికార్డ్‌ను సమం చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడం ద్వారా వరుణ్ చక్రవర్తీ ఈఫీట్ సాధించాడు.
వరల్డ్ రికార్డ్..
వరల్డ్ నెంబర్ వన్ టీ20 బౌలర్ అయిన వరుణ్ చక్రవర్తీ.. తన మిస్టరీ స్పిన్‌తో నెదర్లాండ్స్ పతనాన్ని శాసించాడు. పవర్ ప్లే ఆఖరి ఓవర్ నాలుగో బంతికి నెదర్లాండ్స్ ఓపెనర్ మాక్స్ ఓ డౌడ్‌ను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా వరుణ్ చక్రవర్తీ ఈ రికార్డ్ నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుణ్ చక్రవర్తీకి వరుసగా 17వ మ్యాచ్‌లో దక్కిన వికెట్ ఇది.
అర్ష్‌దీప్ సింగ్ జూన్ 2024 నుంచి డిసెంబర్ 2025 మధ్య భారత్ తరఫున వరుసగా 17 మ్యాచ్‌ల్లో కనీసం ఒక వికెట్ తీసాడు. వరుణ్ చక్రవర్తీ ఈ రికార్డ్‌ను సమం చేశాడు. అతను 2025 నుంచి తాజా మ్యాచ్ వరకు వరుసగా 17 మ్యాచ్‌ల్లో వికెట్లు పడగొట్టాడు. ఈ 17 మ్యాచ్‌ల్లో వరుణ్ చక్రవర్తీ మొత్తం 31 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో వరుణ్ చక్రవర్తీ, అర్ష్‌దీప్ సింగ్ తర్వాత ఆశిస్ నెహ్రా ఉన్నాడు. అతను వరుసగా 13 మ్యాచ్‌ల్లో కనీసం ఒక వికెట్ తీసాడు.

వరుసగా వికెట్లు తీసిన భారత బౌలర్లు:
- వరుణ్ చక్రవర్తి 17 మ్యాచ్‌లు *
- అర్ష్‌దీప్ సింగ్ 17 మ్యాచ్‌లు
- ఆశిష్ నెహ్రా 13 మ్యాచ్‌లు
టీ20ల్లో వరుసగా అత్యధిక మ్యాచ్‌ల్లో వికెట్లు తీసిన బౌలర్లు:
- సందీప్ లామిచానే (నేపాల్ 2022) 26
- ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్ 2026) 24
- వానిందు హసరంగా(శ్రీలంక) 23
- వరుణ్ చక్రవర్తి(భారత్) 17* (Active)
- అర్ష్‌దీప్ సింగ్(భారత్ 2025) 17
- ఇష్ సోధి (న్యూజిలాండ్) 16
4 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు..
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో వరుణ్ చక్రవర్తీ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అమెరికాపై ఒక వికెట్, నమీబియాపై మూడు వికెట్లు, పాకిస్థాన్‌పై రెండు, నెదర్లాండ్స్‌పై 3 వికెట్లు తీసాడు. మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు.
నెదర్లాండ్స్ మ్యాచ్‌లో 3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన వరుణ్ చక్రవర్తీ 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసాడు. వరుణ్ చక్రవర్తీకి సూర్య ఫుట్ కోటా ఓవర్లు ఇవ్వడం లేదు. సూపర్ 8కు ముందు అతన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అతని మిస్టరీ బౌలింగ్‌ను ప్రత్యర్థులు ఛేదించవద్దనే ఉద్దేశంతో సూర్య ఇలా చేస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications