ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో ఏకపక్ష విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు నెదర్లాండ్స్ నుంచి అనూహ్యం ప్రతిఘటన ఎదురైంది. భారత టాపార్డర్ బ్యాటర్ల దూకుడుకు నెదర్లాండ్స్ బౌలర్లు తమ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కళ్లెం వేసారు. ఫియర్‌లెస్ గేమ్‌తో భారీ స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసే భారత టాపార్డర్ బ్యాటర్లు.. నెదర్లాండ్స్ బౌలర్ల ధాటికి స్లోగా ఆడారు.
శివమ్ దూబే (31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66 ) ఒక్కడే 200 ప్లస్ స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీతో భారత జట్టును ఆదుకున్నాడు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్నీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్(3/56) మూడు వికెట్లు తీయగా.. ఆర్యన్ దత్(2/19) రెండు వికెట్లు పడగొట్టాడు. కైల్ క్లేన్ ఒక వికెట్ తీసాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మరోసారి నిరాశే ఎదురైంది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ(0) మరోసారి డకౌట్ కాగా.. ఇషాన్ కిషన్(18) దురదృష్టవశాత్తు పెవిలియన్ చేరాడు. తిలక్ వర్మ(27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31), సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 34) దూకుడుగా ఆడలేకపోయారు.
శివమ్ దూబే కూడా ఆరంభంలో తడబడినా ఆ తర్వాత దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. భారీ సిక్సర్లతో నెదర్లాండ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి తోడుగా హార్దిక్ పాండ్యా కూడా 3 భారీ సిక్స్‌లు బాదడంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది.
ఆఖరి ఓవర్‌లో సిక్స్ బాదిన శివమ్ దూబే మరో సిక్స్ కొట్టే ప్రయత్నంలో బౌండరీ లైన్‌పై నెదర్లాండ్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్.. సిక్సర్ బాది సింగిల్ తీయగా.. ఆఖరి బంతికి హార్దిక్ పాండ్యా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
69/3 స్కోర్ వద్ద క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే.. సూర్యతో కలిసి నాలుగో వికెట్‌కు 41 పరుగులు జోడించాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ రెండు భాగస్వామ్యాలు ఈ మ్యాచ్‌లో భారత్‌ను నిలబెట్టాయి.