IND vs NAM: ఇషాన్, హార్దిక్ ఊచకోత.. తల పట్టుకున్న నమీబియా బౌలర్లు!
Ishan Kishan: టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్(24 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61), హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరూ బ్యాటర్లు పరుగుల విధ్వంసం సృష్టించారు.
దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. చివర్లో నమీబియా బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేసి భారత భారీ స్కోర్‌కు అడ్డుకట్ట వేసారు. కెప్టెన్ ఎరాస్మస్(4/20) నాలుగు వికెట్లు తీయగా.. బెన్ షికోంగో, జేజే స్మిత్, బెర్నార్డ్ స్కాల్ట్జ్ తలో వికెట్ తీసారు.
ఇషాన్ కిషన్ ఊచకోత..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ దూకుడుగా ప్రారంభించారు. ఒక ఫోర్, 3 సిక్స్‌లతో దూకుడు కనబర్చిన సంజూ శాంసన్(22) అనవసర షాట్‌తో పెవిలియన్ చేరాడు. కానీ క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మతో కలిసి ఇషాన్ కిషన్ విరుచుకుపడ్డాడు. వరుస బౌండరీలతో నమీబియా బౌలర్లను బెంబేలెత్తించాడు. జేజే స్మిత్ వేసిన 6వ ఓవర్‌లో ఇషాన్ కిషన్ వరుసగా 4 సిక్స్‌లు, ఫోర్ బాది 20 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

తలపట్టుకున్న నమీబియా బౌలర్లు..
ఆ తర్వాత కూడా అదే జోరు కనబర్చాడు. ఇషాన్ కిషన్ విధ్వంసంతో నమీబియా బౌలర్లు తల పట్టుకున్నారు. చివరకు కెప్టెన్ గెర్‌హార్డ్ ఎరాస్మస్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 79 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. సూర్యకుమార్ యాదవ్(12), తిలక్ వర్మ(25) విఫలమైనా.. హార్దిక్ పాండ్యా దంచికొట్టాడు. భారీ సిక్సర్లతో నమీబియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇషాన్ ఔటయ్యాడని ఊపిరి పీల్చుకున్న నమీబియ బౌలర్లను హార్దిక్ ఉక్కిరి బిక్కిరి చేశాడు.
గెర్‌హార్డ్ బౌలింగ్ భారీ సిక్సర్ బాదిన హార్దిక్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ ఆ మరుసటి బంతికే క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడంతో 81 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ మరుసటి బంతికే శివమ్ దూబే(23) రనౌటవ్వగా.. ఆఖరి బంతికి అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివరి ఓవర్‌లో రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్ కూడా ఔటవ్వడంతో 230 ప్లస్ స్కోర్ చేస్తుందని భావించిన భారత్ 209 పరుగులకే పరిమితమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications