IND vs IRE: అర్షదీప్ సింగ్ ఏం పాపం చేశాడురా? ఒక్క చాన్స్ ఇవ్వడం లేదు! ఫ్యాన్స్ ఫైర్

హైదరాబాద్: టీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. వరుసగా రెండో సిరీస్ రెండో మ్యాచ్‌లోనూ అతనికి అవకాశం దక్కలేదు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2022 సీజన్‌లో తనదైన బౌలింగ్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న అర్షదీప్.. ఆ ప్రదర్శనతోనే తొలిసారి భారత జట్టు పిలుపును అందుకున్నాడు. సౌతాఫ్రికాతో ముగిసిన ఐదు టీ20ల సిరీస్‌కు ఎంపికై బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఆ సిరీస్ అనంతరం ఐర్లాండ్ పర్యటనకు వచ్చిన ఈ యువ ప్లేయర్‌కు ఇక్కడ కూడా అవకాశం దక్కలేదు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. రెండో టీ20లో టీమ్‌మేనేజ్‌మెంట్ మూడు మార్పులు చేసినా.. అర్షదీప్ సింగ్‌కు మాత్రం అవకాశం ఇవ్వలేదు.
ఎందుకు ఎంపిక చేశారు.?
దాంతోనే అతని అభిమానులు బీసీసీఐతో పాటు టీమ్‌మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ద్రవిడ్ అండ్ కోను బండబూతులు తిడుతున్నారు. అసలు అర్షదీప్ సింగ్ చేసిన పాపం ఏంటని నిలదీస్తున్నారు. వరుసగా జట్టుకు ఎంపిక చేసి ఆడించకపోవడం వెనుక ఉన్న విషయం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బెంచ్‌కు పరిమితం చేయాలని భావించినప్పుడు అతన్ని ఈ సిరీస్‌లకు ఎందుకు ఎంపిక చేశారని అడుగుతున్నారు.
రాహుల్ త్రిపాఠిని కూడా..
ఇక ఐపీఎల్‌లో సత్తాచాటిన రాహుల్ త్రిపాఠి సైతం ఐర్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ అతను రెండు మ్యాచ్‌ల్లోనూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీపక్ హుడా సత్తా చాటుతుండటంతో అతని అవకాశాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే రాహుల్ త్రిపాఠిపై అభిమానులు సానుభూతి కనబరుస్తున్నారు. కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఆడించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఇక గత మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన యుజ్వేంద్ర చాహల్‌ను పక్కనపెట్టి రవి బిష్ణోయ్‌ను తీసుకోవడం ఏ మాత్రం సమంజసం కాదంటున్నారు.

చెలరేగిన హుడా..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ త్వరగా ఔటైనా.. క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా, సంజూ శాంసన్ చెలరేగారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో స్కోర్ బోర్డును పరుగెత్తించారు. ఈ క్రమంలోనే దీపక్ హుడా ముందుగా హాఫ్ సెంచరీ చేసుకోగా.. ఆ తర్వాత సంజూ శాంసన్ అర్థ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఈ జడీ ఆకాశమే హద్దుగా చెలరేగింది. దాంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications