For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs IRE: ద్రవిడ్ నోట.. శభాష్ రా.. రాహుల్! నవ్వులే నవ్వుల్!(వీడియో)

టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా తొలి పోరుకు సిద్దమైంది. మరికాసేపట్లో న్యూయార్క్ వేదికగా ప్రారంభం కానున్న గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్న రాహుల్ ద్రవిడ్.. తన మాటలతో నవ్వులు పూయించాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పసికూన ఐర్లాండ్‌‌ను ఉద్దేశించి హిందీలో మాట్లాడిన ద్రవిడ్.. టీ20 ఫార్మాట్‌లో ఏ జట్టును కూడా తక్కువ అంచనా వేయవద్దని చెప్పాడు. ఈ విషయం చెప్పే క్రమంలో ద్రవిడ్ కఠినమైన నజరండాజ్ అనే పదాన్నిస్పష్టంగా పలికాడు.

IND vs IRE Rahul Dravid praises himself on usage of Urdu word ahead of T20 World Cup 2024 campaign

ఆ వెంటనే 'వాహ్ నాట్ బ్యాడ్.. వెల్‌డన్ రాహుల్'అని బిగ్గరగా నవ్వాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు ఇదే చివరి టోర్నీ. ఈ విషయంపై స్పందించిన రాహుల్ ద్రవిడ్.. కుటుంబానికి సమయం కేటాయించేందుకే తాను మళ్లీ టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోలేదని స్పష్టం చేశాడు.

'టీమిండియా హెడ్ కోచ్‌గా ఇదే నా చివరి టోర్నీ. టీమిండియా టైట్ షెడ్యూల్, నా వ్యక్తిగత జీవితం నేపథ్యంలోనే నేను మళ్లీ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోలేదు. ఇదే చివరి టోర్నీ. ఇది కూడా గత టోర్నీల్లానే. కోచింగ్ అంటే నాకు చాలా ఇష్టం. టీమిండియా కోచ్‌గా నేను ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాను. జాతీయ జట్టుకు కోచ్‌గా ఉండటం అనేది నిజంగా ప్రత్యేకమైనదే. ప్రతిభావంతులైన ఆటగాళ్లతో కలిసి పని చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది'అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

టీమిండియా హెడ్ కోచ్‌ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోవడంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. హెడ్‌కోచ్‌గా కొనసాగాలని ద్రవిడ్‌ను తాను కోరానని.. కాను అందుకు అయన అంగీకరించలేదని గద్గద స్వరంతో చెప్పుకొచ్చాడు. 'టీమిండియా హెడ్ కోచ్‌గా కొనసాగాలని రాహుల్ ద్రవిడ్‍ను కోరాను. అయితే అందుకు ఆయన సిద్దంగా లేరు'అని రోహిత్ శర్మ తెలిపాడు.

రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌ను ఆస్వాదించానని రోహిత్ చెప్పాడు. 'ఆయన మా అందరికీ ఒక రోల్ మోడల్ లాంటి వారు. ఆయన తన కెరీర్‌లో ఏం సాధించారో మనందరికి తెలుసు. కెరీర్‌లో చాలా అంకితభావం చూపించారు. ఆయన సారథ్యంలో కూడా నేను ఆడాను'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, June 5, 2024, 18:50 [IST]
Other articles published on Jun 5, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+