IND vs IRE: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం! జియో హాట్‌స్టార్‌లో రాదు.. ఎలా చూడాలంటే?
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం తొలి మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. రెండు టీ20ల సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా శుక్రవారం తొలి మ్యాచ్ ఆడనుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా మంగళవారమే ఐర్లాండ్ ఫ్లైట్ ఎక్కింది. ఈ సిరీస్‌తో టీమిండియా ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2027 రోడ్ మ్యాప్ మొదలవ్వనుంది.
టీ20 ప్రపంచకప్ 2026 గెలిపించిన సూర్యకుమార్ యాదవ్‌తో పాటు పలువురు ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరం కాగా.. ఐపీఎల్ స్టార్లకు అవకాశం దక్కింది. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయబోతున్నాడు.

శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లోనే వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగే అవకాశం ఉంది. చివరి నిమిషంలో ఈ పర్యటనకు టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో అతనికి విశ్రాంతి అవసరమని బీసీసీఐ మెడికల్ టీమ్ సూచించింది. దాంతో అతని స్థానంలో పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ సూర్యాన్ష్ షెడ్జేకు అవకాశం దక్కింది.
భారత్ X ఐర్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్
తొలి టీ20: జూన్ 26 (సాయంత్ర 6 గంటలకు)
రెండో టీ20: జూన్ 28 (సాయంత్ర 6 గంటలకు)
ఎలా చూడాలంటే..?
ఈ సిరీస్‌కు సోనీ నెట్‌వర్క్ బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. సోనీ స్పోర్ట్స్ టెన్ ఛానెల్స్‌తో పాటు సోనీ లివ్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా ఈ మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి. అయితే ఈ రెండు వేదికల్లో మ్యాచ్‌లు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ఫ్రీగా చూసే వెసులు బాటు అయితే లేదు. ప్రత్యేక మొబైల్ రిఛార్జ్ ప్లాన్స్‌తో సోనీ లివ్ యాప్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.
ఐర్లాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు(అంచనా):
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్/వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, సూర్యన్ష్ షెడ్గే, హర్షిత్ రాణా, రవిబిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్.
ఐర్లాండ్ పర్యటనకు ఎంపికైన భారత జట్టు
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సూర్యన్ష్ షెడ్గే, సంజూ శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

