Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs IRE: భారత్ ఘోర పరాజయం.. చరిత్ర సృష్టించిన ఐర్లాండ్!

వరల్డ్ ఛాంపియన్ టీమిండియాకు ఘోర పరాజయం ఎదురైంది. పసికూన ఐర్లాండ్‌ చేతిలో ఖంగుతిన్నది. రెండు టీ20 సిరీస్‌ల భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన భారత్ 34 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. చెత్త బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని కాదని సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తే వారు జట్టును నట్టేట ముంచారు. దాంతో శ్రేయస్ అయ్యర్ సారథ్యం ఓటమితో మొదలైంది.

మరోవైపు ఈ విజయంతో ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌పై ఐర్లాండ్‌కు ఇదే తొలి విజయం. గత 8 ప్రయత్నాల్లో దక్కని విజయం ఈ సారి వరించింది. ఈ గెలుపుతో రెండు టీ20ల సిరీస్‌లో ఐర్లాండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం జరిగే రెండో టీ20ల ఓడినా సిరీస్ సమమవుతోంది.

కుప్పకూలిన భారత్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. కెప్టెన్ లోర్కన్ టక్కర్(36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. గారెత్ డెలనీ(32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. జార్జ్ డాక్‌రెల్(10 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 19) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా(3/24) మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్(2/28), అక్షర్ పటేల్(2/33) రెండేసి వికెట్లు పడగొట్టారు.

IND vs IRE Ireland Script History with Stunning 34-Run Win Over India Abhishek Sharma s Fifty Goes in Vain

అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అభిషేక్ శర్మ(20 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. శివమ్ దూబే(14 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 25) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

పంతం నెగ్గించుకున్న గంభీర్..పాపం బుడ్డోడు డ్రింక్స్ బాయ్‌గా..!

పంతం నెగ్గించుకున్న గంభీర్..పాపం బుడ్డోడు డ్రింక్స్ బాయ్‌గా..!

ఐర్లాండ్ బౌలర్లలో మ్యాట్ హోల్డార్డ్(3/28), మాథ్యూ హంప్రేస్(3/38) మూడేసి వికెట్లు తీయగా.. జై మూండ్రా రెండేసి వికెట్లు పడగొట్టాడు. లియామ్ మెక్‌కార్తీ, గారెత్ డెలానీ తలో వికెట్ తీసారు. ఈ ఓటమి భారత అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయం తర్వాత టీమిండియా ఆడిన తొలి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.

కొంపముంచిన సంజూ శాంసన్..

183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. మూండ్రా వేసిన రెండో ఓవర్‌లోనే సంజూ శాంసన్(5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్(1), శ్రేయస్ అయ్యర్(3) కూడా తీవ్రంగా నిరాశపర్చారు. దాంతో భారత్ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయింది. ఓవైపు వికెట్లు పడినా మరోవైపు అభిషేక్ శర్మ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతన్ని మెక్‌కార్తీ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

అందుకే వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వలేదు: శ్రేయస్ అయ్యర్

అందుకే వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వలేదు: శ్రేయస్ అయ్యర్

చేతులెత్తేసిన తిలక్, సుందర్

జట్టును ఆదుకుంటారని భావించిన తిలక్ వర్మ(21 బంతుల్లో 3 ఫోర్లతో 19), వాషింగ్టన్ సుందర్(12 బంతుల్లో 9) కూడా చేతులెత్తేసారు. దాంతో 100 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అక్షర్ పటేల్‌తో జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన శివమ్ దూబే(25) కూడా రిట్నర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో 7వ వికెట్‌కు నమోదైన 35 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే అక్షర్ పటేల్(15) కూడా ఔటవ్వడంతో భారత్ ఓటమి ఖాయమైంది. సిక్సర్‌తో జోరు కనబర్చిన హర్షిత్ రాణా(8) క్యాచ్ ఔట్‌ అవ్వగా.. ఆఖరి వికెట్‌గా అర్ష్‌దీప్ సింగ్(2) వెనుదిరిగాడు.

Story first published: Friday, June 26, 2026, 21:47 [IST]
Other articles published on Jun 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+