Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs IRE: నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. కుప్పకూలిన ఐర్లాండ్!

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీని భారత బౌలర్లు ఘనంగా ప్రారంభించారు. గ్రూప్-ఏలో భాగంగా ఐర్లాండ్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో భారత బౌలర్లు హార్దిక్ పాండ్యా(3/27), జస్‌ప్రీత్ బుమ్రా(2/6), అర్ష్ దీప్ సింగ్(2/35), మహమ్మద్ సిరాజ్(1/13), అక్షర్ పటేల్(1/3) నిప్పులు చెరిగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులు చేసింది.

ఐర్లాండ్ బ్యాటర్లలో గెరాత్ డెలానీ(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26), జోష్ లిటిల్(13 బంతుల్లో 2 ఫోర్లతో 14), కర్టిస్ కాంఫెర్(8 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 12) మాత్రమే రెండెంకల స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

IND vs IRE Ireland bowled out for 96 on a shocking pitch in T20 World Cup 2024

అదరగొట్టిన అర్ష్‌దీప్ సింగ్
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌కు అర్ష్‌దీప్ సింగ్ ఆదిలోనే గట్టి షాక్ ఇచ్చాడు. పిచ్‌ నుంచి లభించిన అడ్వాంటేజ్‌ను అందిపుచ్చుకున్న అతను ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే ఐర్లాండ్ ఓపెనర్లు ఆండీ బాల్బిర్నీ(5), పాల్ స్టిర్లింగ్(2)ను పెవిలియన్ చేర్చాడు. తొలి బంతికి
పాల్ స్టిర్లింగ్‌ను క్యాచ్ ఔట్ చేసిన అర్ష్‌దీప్ సింగ్.. చివరి బంతి ఆండీ బాల్బిర్నీ క్లీన్ బౌల్డ్ చేశాడు.

ఐదో ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ తన బౌలింగ్‌లో లైన్ తప్పాడు. నాలుగు వైడ్స్‌తో పాటు రెండు బౌండరీలతో 13 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో రోహిత్ బంతిని బుమ్రాకు అందివ్వగా.. అతను నిప్పులు చెరిగాడు. సరైన లైన్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసి ఒక్క పరుగు ఇవ్వకుండా మెయిడిన్ చేశాడు. దాంతో ఐర్లాండ్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 26 పరుగులే చేసింది.

నిప్పులు చెరిగన హార్దిక్..
పవర్ ప్లే అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ.. హార్దిక్ పాండ్యా‌కు బంతిని అందివ్వగా వికెట్ సాధించాడు. అతని స్టన్నింగ్ డెలివరీకి లోర్కాన్ టకర్(10) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హార్దిక్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను టకర్ డ్రైవ్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఇన్‌స్వింగ్ అయిన బంతి మిడిల్ స్టంప్‌ను లేపేసింది.

బుమ్రా ఆ మరుసటి ఓవర్‌లో హ్యారీ టెక్టర్(4)ను క్యాచ్ ఔట్ చేశాడు. హార్దిక్ పాండ్యా తన మరుసటి ఓవర్‌లో కాంఫెర్(12)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చగా.. 10వ ఓవర్‌లో సిరాజ్ డాక్‌రెల్(3)ను ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీసాడు. 11వ ఓవర్ తొలి బంతికే హార్దిక్ పాండ్యా.. మార్క్ అడైర్(3) ఔట్ చేయడంతో పాటు మెయిడిన్ చేయడంతో ఐర్లాండ్ 11 ఓవర్లలో 7 వికెట్లకు 49 పరుగులే చేసింది.

IND vs IRE Ireland bowled out for 96 on a shocking pitch in T20 World Cup 2024

బుమ్రా స్టన్నింగ్ యార్కర్
ఈ పరిస్థితుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ అక్షర్ పటేల్‌ను తీసుకురాగా.. అతను కూడా వికెట్ తీసాడు. మెక్‌కార్తీ(0‌)ని క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన జోష్ లిటిల్(14), గారెత్ డెలనీ(27) దూకుడుగా ఆడి ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశాడు. అయితే జస్‌ప్రీత్ బుమ్రా స్టన్నింగ్ యార్కర్‌తో జోష్ లిటిల్(14)ని క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా తీసిన ఈ వికెట్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. జోష్ లిటిల్ ఔటైనా.. బెన్ వైట్(1)తో కలిసి గారెత్ డెలానీ పోరాడాడు. అయితే క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో డెలానీ రనౌటవ్వడంతో ఐర్లాండ్ పోరాటం ముగిసింది.

Story first published: Wednesday, June 5, 2024, 21:40 [IST]
Other articles published on Jun 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+