టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా తొలి పోరుకు సిద్దమైంది. ఐర్లాండ్‌తో న్యూయార్క్ వేదికగా ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. చిన్న జట్టే అయినా సంచలనాలకు ఐర్లాండ్ మారు పేరు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా టీమిండియా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటోంది.
ఇరు జట్ల బలబలాలను పరిశీలిస్తే టీమిండియానే హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే అమెరికాలోని డ్రాప్ ఇన్ పిచ్‌లపై భారత్ ఆచితూచి ఆడాల్సింది. ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇదే విషయాన్ని వెల్లడించాడు. ఈ డ్రాప్ ఇన్ పిచ్‌లపై 140 పరుగులు చేసినా గొప్ప లక్ష్యమేనని పేర్కొన్నాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్‌లతో టీమిండియా బ్యాటింగ్ విభాగం భీకరంగా ఉంది. పైగా అందరూ రెండు నెలలపాటు ఐపీఎల్ ఆడి సూపర్ ఫామ్‌లో ఉన్నారు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలతో పాటు పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది.
ఫ్రీగా ఎలా చూడాలంటే..?
టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్‌లు భారత్‌లో అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో రానున్నాయి. స్టార్ స్పోర్ట్స్ 1తో పాటు తదితర భాషాల ఛానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. తెలుగుతో పాటు కన్నడ, మళయాళం, తమిళ, భోజ్‌పూర్, హిందీ కామెంట్రీతో మ్యాచ్‌ల లైవ్ రానుంది. స్టార్ గ్రూప్‌కే చెందిన డిస్నీ హాట్‌స్టార్ ఓటీటీ యాప్‌లో ఈ మ్యాచ్‌లు ఫ్రీగా రానున్నాయి.
భారత్‌లో డిస్నీ హాట్‌స్టార్ వేదికగా ప్రపంచకప్ మ్యాచ్‌లను ఫ్రీగా చూడవచ్చు. ప్రపంచకప్‌లో టీమిండియా ఆడే మ్యాచ్‌లను దూరదర్శన్ ఉచితంగా ప్రసారం చేయనుంది.
పిచ్, వాతావరణం
బంగ్లాదేశ్‌తో ఆడిన వార్మప్ వేదికపైనే భారత్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ జరగనుంది. న్యూయార్క్ వికెట్ డ్రాప్ ఇన్ పిచ్. బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. పేలవమైన ఔట్ ఫీల్డ్ వల్ల బ్యాటర్లకు పరుగులు అంత సులువుగా రాకపోవచ్చు. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు అయితే లేదు.