Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs IRE: హార్దిక్ పాండ్యా స్టన్నింగ్ డెలివరీ.. ఎగిరిపోయిన మిడిల్ స్టంప్! (వీడియో)

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఘనంగా ప్రారంభించాడు. గ్రూప్-ఏలో భాగంగా ఐర్లాండ్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా తన ఫస్ట్ ఓవర్‌లోనే వికెట్ తీసాడు. అతని స్టన్నింగ్ డెలివరీకి లోర్కాన్ టకర్(10) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా స్టన్నింగ్ డెలివరీకి మిడిల్ స్టంప్ ఎగిరిపోయింది. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

పవర్ ప్లే అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ.. హార్దిక్ పాండ్యా‌కు బంతిని అందివ్వగా.. ఐదో బంతికే వికెట్ తీసాడు. అతను వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను టకర్ డ్రైవ్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఇన్‌స్వింగ్ అయిన బంతి మిడిల్ స్టంప్‌ను లేపేసింది. ఈ స్టన్నింగ్ డెలివరీకి టకర్ బిత్తరపోయాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు.

IND vs IRE Hardik Pandya uproots Lorcan Tucker s wicket with a stunning delivery WATCH

తన మరుసటి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా కాంఫెర్(12)ను కీపర్ క్యాచ్‌గా ఔట్ చేశాడు. మూడో ఓవర్‌లో మార్క్ అడైర్(3)ను ఔట్ చేసి మూడో వికెట్‌ను హార్దిక్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌కు అర్ష్‌దీప్ సింగ్ ఆదిలోనే గట్టి షాక్ ఇచ్చాడు. పిచ్‌ నుంచి లభించిన అడ్వాంటేజ్‌ను అందిపుచ్చుకున్న అతను మూడో ఓవర్‌లోనే ఐర్లాండ్ ఓపెనర్లు ఆండీ బాల్బిర్నీ(5), పాల్ స్టిర్లింగ్(2)ను పెవిలియన్ చేర్చాడు.

పాల్ స్టిర్లింగ్‌ను క్యాచ్ ఔట్ చేసిన అర్ష్‌దీప్ సింగ్.. ఆండీ బాల్బిర్నీ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం బుమ్రా ఓ ఓవర్ మెయిడిన్ చేయగా హార్దిక్ పాండ్యా తన వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. మధ్యలో హ్యారీ టెక్టర్(4)ను బుమ్రా క్యాచ్ ఔట్ చేయగా.. జార్జీ డాక్‌రెల్‌(3)ను సిరాజ్ పెవిలియన్ చేర్చడంతో ఐర్లాండ్ 10 ఓవర్లలో 49 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.

Story first published: Wednesday, June 5, 2024, 21:09 [IST]
Other articles published on Jun 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+