IND vs IRE: శతక్కొట్టిన దీపక్ హుడా.. చెలరేగిన సంజూ ! ఐర్లాండ్ ముందు తిరుపతి కొండంత లక్ష్యం!

డబ్లిన్: టీమిండియా యువ ప్లేయర్ దీపక్ హుడా(57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104) సెంచరీతో కదం తొక్కాడు. ఐర్లాండ్ పర్యటనలో తొలి మ్యాచ్‌లో విన్నింగ్ నాక్ ఆడిన హుడా.. రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 9 ఫోర్లు, 6 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతనికి తోడుగా సంజూ శాంసన్(42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఐర్లాండ్ ముందు భారత్ 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఈ ఇద్దరి (రెండో వికెట్‌కు 176 పరుగుల) రికార్డు భాగస్వామ్యంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 225 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ మూడు వికెట్లు తీయగా.. జోష్ లిటిల్, క్రైగ్ యంగ్ రెండు వికెట్లు పడగొట్టారు.

ఇషాన్ ఔటైనా..
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్ తొలి బంతికే స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్(3) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి వచ్చిన దీపక్ హుడాభారీ సిక్సర్ బాది బౌండరీల ఖాతా తెరిచాడు. అతనికి తోడుగా సంజూ శాంసన్ కూడా మెరుపులు మెరిపించడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో హుడా ఓ సిక్స్ బాదగా.. సంజూ శాంసన్ రెండు బౌండరీలు కొట్టాడు. దాంతో భారత్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది.

క్యాచ్ నేలపాలు చేసి..
అనంతరం భారత బ్యాటర్లు కాస్త నెమ్మదించగా.. 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హుడా ఇచ్చిన క్యాచ్‌ను ఐర్లాండ్ ఆటగాళ్ల నేలపాలు చేశారు. ఈ అవకాశాన్ని అందుకున్న హుడా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇన్నింగ్స్ 10 ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదిన హుడా.. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఇది హుడాకు కెరీర్‌లో ఫస్ట్ ఫిఫ్టీ. అతని ధాటికి భారత్ 10 ఓవర్లలోనే 97 పరుగులు చేసింది. ఆ తర్వాత హుడా మరింత ధాటిగా ఆడాడు. ఇక డెలానీ వేసిన 13వ ఓవర్‌లో బౌండరీ బాదిన సంజూ.. కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఈ జోడీ ఆకాశమే హద్దుగా చెలరేగింది.

సూపర్ సెంచరీ
వరుస సిక్సర్లు, బౌండరీలతో బౌలర్లకు చుక్కలు చూపించారు. సెంచరీ దిశగా దూసుకెళ్లిన సంజూను అడైర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో రెండో వికెట్‌కు నమోదైన 176 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన సూర్య వచ్చి రావడంతో వరుసగా రెండు బౌండరీలు బాదగా.. హుడా క్విక్ సింగిల్‌తో 55 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత భారీ షాట్లు ఆడే క్రమంలో సూర్య(15), హుడా(104), దినేశ్ కార్తీక్(0), అక్షర్ పటేల్(0) వరుసగా పెవిలియన్ చేరారు. చివరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా ఓ బౌండరీ బాదడంతో భారత్ 227 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications