Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs IRE: దంచికొట్టిన దీపక్ హుడా.. పసికూనపై భారత్ ఘనవిజయం!

IND vs IRE: Deepak Hooda and Bhuvneshwar Kumar star as India thrash Ireland by 7 wickets

డబ్లిన్: ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ఆదివారం వర్షం ఆటంకం కలిగించిన మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. భువనేశ్వర్‌ కుమార్‌ (1/16), యుజ్వేంద్ర చాహల్‌ (1/11) ప్రత్యర్థిని కట్టడి చేశారు. హ్యారీ టెక్టార్‌ ( 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64 నాటౌట్) ఆతిథ్య జట్టుకు మెరుగైన స్కోరును అందించాడు.

అనంతరం దీపక్‌ హుడా ( 29 బంతుల్లో 6 ఫోర్లు, 3సిక్స్‌లతో 47 నాటౌట్‌), ఇషాన్‌ కిషన్‌ (11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26 ), హార్దిక్‌ పాండ్యా ( 12 బంతుల్లో ఫోర్, మూడు సిక్స్‌లతో 24) చెలరేగడంతో భారత్‌.. 9.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఐర్లాండ్‌ బౌలర్లలో యంగ్‌ (2/18) ఒక్కడే ప్రభావం చూపాడు. సిరీస్‌లో చివరిదైన రెండో టీ20 మంగళవారం జరగనుంది.

చెలరేగిన హుడా..

ఛేదనలో ఇషాన్‌ కిషన్‌.. భారత్‌కు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. లిటిల్‌ వేసిన తొలి ఓవర్లో మూడో బంతి నుంచి వరుసగా 4, 6, 4 బాదేశాడు. యంగ్‌ వేసిన మూడో ఓవర్లోనూ అతను వరుసగా 4, 6 కొట్టాడు. కానీ నాలుగో బంతికి యంగ్‌ అతణ్ని బౌల్డ్‌ చేశాడు. తర్వాతి బంతికే సూర్యకుమార్‌ వికెట్ల ముందు దొరికిపోవడంతో భారత్‌కు ఇబ్బందులు తప్పవనిపించింది. కానీ హార్దిక్‌ పాండ్యా, దీపక్ హుడా ఐర్లాండ్‌కు అవకాశం ఇవ్వలేదు. వెంట వెంటనే రెండు వికెట్లు పడ్డప్పటికీ.. ఆ ప్రభావమే కనిపించనివ్వకుండా ఇద్దరూ ధాటిగా ఆడారు. దీంతో మెక్‌బ్రైన్‌ వేసిన ఆరో ఓవర్లో హార్దిక్‌ 2 సిక్సర్లు బాదితే.. హుడా ఒక సిక్స్‌ కొట్టాడు. లిటిల్‌ వేసిన 8వ ఓవర్లో హుడా రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌ బాదాడు. కానీ అదే ఓవర్‌ చివరి బంతికి హార్దిక్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కార్తీక్‌ (5 నాటౌట్‌)తో కలిసి హుడా విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

టెక్టార్‌ ఒక్కడే..:

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్‌ 108 పరుగులు చేయడం గొప్ప విషయమే. భువనేశ్వర్‌ ఇన్నింగ్స్‌ అయిదో బంతికే ఆ జట్టు కెప్టెన్‌ బాల్‌బిర్నీ (0)ని బౌల్డ్‌ చేసి జట్టుకు శుభారంభాన్నందించాడు. తర్వాతి ఓవర్లో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (1/26).. స్టిర్లింగ్‌ (4)ను పెవిలియన్‌ చేర్చాడు. డెలానీ (8)ని అవేష్‌ తన తొలి ఓవర్లోనే వికెట్‌ కీపర్‌ క్యాచ్‌తో వెనక్కి పంపడంతో ఐర్లాండ్‌ 22/3తో కష్టాల్లో పడింది. అయితే టెక్టార్‌ భారత బౌలర్లపై ఎదురు దాడి చేయడం.. టకర్‌ (18) కూడా అతడికి సహకరించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 8 ఓవర్లకు స్కోరు 69/3. హార్దిక్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది ఊపుమీద కనిపించిన టకర్‌.. చాహల్‌ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌ ఆడబోయి వెనుదిరిగాడు. టెక్టార్‌ చివరి దాకా దూకుడు కొనసాగించడంతో ఐర్లాండ్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

2 గంటల 20 నిమిషాలు ఆలస్యం..

2 గంటల 20 నిమిషాలు ఆలస్యం..

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరఫున సత్తా చాటిన యువ పేసర్‌ ఉమ్రాన్‌మాలిక్‌ ఈ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ఈ మ్యాచ్‌ ఆరంభం కావాల్సి ఉండగా.. టాస్‌ పడ్డ కాసేపటికే వరుణుడి ప్రతాపం మొదలవడంతో ఆట సాధ్యం కాలేదు. మధ్యలో వర్షం ఆగి ఆట ఆరంభమయ్యేలా కనిపించినా, మళ్లీ వరుణుడు ప్రతాపం చూపించాడు. చివరికి నిర్ణీత సమయం కంటే 2 గంటల 20 నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్‌ మొదలైంది. తర్వాత వర్షం అంతరాయం కలిగించలేదు.

Story first published: Monday, June 27, 2022, 8:24 [IST]
Other articles published on Jun 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+