Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs HKG: సూర్య సిక్లర్ల సునామీ.. కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్! హంకాంగ్ ముందు భారీ లక్ష్యం!

Virat Kohli, Suryakumar Yadavs

దుబాయ్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(44 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 59 నాటౌట్) క్లాస్ ఇన్నింగ్స్‌కు సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్ తోడవడంతో భారత్.. హాంకాంగ్ ముందు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 192 పరుగులు చేసింది. విరాట్, సూర్య అజేయ హాఫ్ సెంచరీలకు అండగా రోహిత్(26), రాహుల్(36) పర్వాలేదనిపించారు. హంకాంగ్ బౌలర్లలో ఆయుష్ శుక్లా, మహమ్మద్ ఘజన్‌ఫర్ తలో వికెట్ తీసారు. 18 ఓవర్ల వరకు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన అఫ్గాన్.. సూర్య సునామీ ఇన్నింగ్స్‌తో లయ తప్పింది.

ధాటిగా ఆడిన రోహిత్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ(13 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 21), కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. ఓవైపు రాహుల్ నిదానంగా ఆడినా.. మరోవైపు రోహిత్ ధాటిగా ఆడాడు. అయితే అదే జోరు‌లో రోహిత్ క్యాచ్ ఔటయ్యాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 38 పరుగులకు తెరపడింది. అనంతరం కేఎల్ రాహుల్, కోహ్లీ నిదానంగా ఆడటంతో పవర్ ప్లే ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 44 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత కూడా ఈ జోడీ ఆచితూచి ఆడటంతో పరుగుల వేగం మందగించింది.

తడబడ్డ రాహుల్..
అజీజ్ ఖాన్ వేసిన 9వ ఓవర్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా కేఎల్ రాహుల్ కొట్టిన సూపర్ సిక్స్ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. డ్రింక్స్ బ్రేక్ తర్వాత టీమ్‌మేనేజ్‌మెంట్ సూచనలతో ఈ జోడీ ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. మహమ్మద్ ఘజన్‌ఫార్ వేసిన 13వ ఓవర్‌లో విరాట్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత రాహుల్ సైతం అదే తరహాలో ఆడబోయి క్యాచ్ ఔట్ అయ్యాడు. దాంతో క్రీజులోకి వచ్చిన సూర్య ఎదుర్కొన్న తొలి రెండు బంతులను స్వీప్ షాట్లతో బౌండరీకి తరలించాడు. మరోవైపు కోహ్లీ సైతం ఓ భారీ సిక్సర్ బాదగా.. సూర్య సైతం విరుచుకుపడ్డాడు. అయితే 17వ ఓవర్‌లో ఎహ్‌సాన్ ఖాన్ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

కోహ్లీ, సూర్య హాఫ్ సెంచరీ..
ఆయూష్ శుక్లా వేసిన 18వ ఓవర్‌లో సూర్య రెండు ఫోర్లు, ఓ భారీ సిక్సర్‌తో 15 పరుగులు పిండుకున్నాడు. ఎహ్‌సాన్ ఖాన్ వేసిన 19 ఓవర్ తొలి బంతికి కోహ్లీ క్విక్ డబుల్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఆసియాకప్‌లో ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఆ వెంటనే అతను మరో భారీ సిక్సర్ బాదాడు. ఆఖరి ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన సూర్య.. 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరో రెండు సిక్స్‌లు భారీ జట్టుకు 192 పరుగుల భారీ స్కోర్ అందించాడు.

Story first published: Wednesday, August 31, 2022, 21:26 [IST]
Other articles published on Aug 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+