
దుబాయ్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఆసియాకప్ 2022తో మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చిన విరాట్ బ్యాట్‌తో పాటు బంతితోను అదరగొడుతున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కీలక 35 పరుగులు చేసిన విరాట్.. హాంగ్ కాంగ్‌తో అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. తద్వారా ఈ ఆసియాకప్‌లో ఫస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68 నాటౌట్)తో కలిసి విరాట్ కోహ్లీ(44 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 59 నాటౌట్) మూడో వికెట్‌కు 98 పరుగులు జోడించాడు.
అనంతరం బౌలింగ్ కూడా చేశాడు. ప్రధాన పేసర్ అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ ధారళంగా పరుగులివ్వడంతో రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీకి బంతనందించాడు. 17వ ఓవర్ బౌలింగ్ చేసిన విరాట్ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అర్షదీప్, ఆవేశ్ ఖాన్ దారుణంగా విఫలమైన వేళ విరాట్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం అభిమానులను ఆకట్టుకుంది. ఇక అప్పుడెప్పుడో ఆరేళ్ల క్రితం 2016 టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన విరాట్.. తన ఫస్ట్ ఓవర్‌లోనే వికెట్ తీసాడు. ఆ మ్యాచ్‌లో విరాట్ అద్భుతంగా బ్యాటింగ్ చేసినప్పటికీ.. విండీస్ వీరులు విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరారు.
సుమారు ఆరేళ్ల తర్వాత మళ్లీ విరాట్ బౌలింగ్ చేయడం అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఓవర్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్ ద్వారా విరాట్ పలు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 31 హాఫ్ సెంచరీలతో రోహిత్ శర్మతో సమంగా నిలిచాడు. అంతేకాకుండా ఆసియాకప్‌లో బెస్ట్ యావరేజ్ కలిగిన ఆటగాడిగా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 192 పరుగులు చేసింది. హంకాంగ్ బౌలర్లలో ఆయుష్ శుక్లా, మహమ్మద్ ఘజన్‌ఫర్ తలో వికెట్ తీసారు. 18 ఓవర్ల వరకు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన అఫ్గాన్.. సూర్య సునామీ ఇన్నింగ్స్‌తో లయ తప్పింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన హాంగ్ కాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో బాబర్ హయత్(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), కించిత్ షా(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీసారు.