
లాజిక్ లెస్ డిసిషన్..
ఈ నిర్ణయాన్ని కూడా గంభీర్ తప్పుబట్టాడు. లాజిక్ లేని మార్పు అని మండిపడ్డాడు. రిషభ్ పంత్‌ను జట్టులోకి తీసుకోవాలనుకుంటే కార్తీక్‌ను పక్కనపెట్టాల్సిందన్నాడు. హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇవ్వాలనుకుంటే అతని స్థానంలో దీపక్ హుడా తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. అసలు టీమ్‌మేనేజ్‌మెంట్ ఉద్దేశం ఏంటో తనకు అర్థం కావడం లేదన్నాడు. హార్దిక్ లేకపోవడం వల్ల భారత్‌కు ఓ బౌలింగ్ ఆప్షన్ లేకుండా పోయిందన్నాడు. హిందీ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న గంభీర్.. మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రీ మ్యాచ్ షోలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

అభిమానులు సైతం..
ఇక అభిమానులు సైతం టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. తడబడుతున్న కేఎల్ రాహుల్‌ను పక్కనపెట్టి రిషభ్ పంత్‌తో ఓపెనింగ్ చేయించాలని సూచిస్తున్నారు. హార్దిక్ స్థానంలో గంభీర్ చెప్పినట్లు హుడాను తీసుకోవాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. గంభీర్‌తో పాటు ఇతర క్రికెట్ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పంత్‌ను స్పెషలిస్ట్ కీపర్‌గా ఆడించాలని సూచిస్తున్నారు.

రెస్ట్ ఇవ్వాలనే..
కీలకమైన హార్దిక్‌కు రెస్ట్ ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని టాస్ సందర్భంగా రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ తీసుకునేవాళ్లమని, అయితే ఈ సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపాడు. పిచ్‌పై గడ్డి ఉందని, పేస్‌కు అనుకూలించే అవకాశం ఉన్నా భారీ స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పాడు. ప్రత్యర్థితో పనిలేకుండా తమ ఆట తాము ఆడుతామని, జట్టుగా రాణించేందుకు కృషి చేస్తామని చెప్పాడు. తాము బేసిక్స్‌కు కట్టుబడి ఉన్నామని,దాంతోనే పాక్‌పై విజయం దక్కిందని తెలిపాడు.

నిలకడగా భారత్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది. 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(30 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ(15 బ్యాటింగ్) ఉన్నారు. రోహిత్ శర్మ(21) ధాటిగా ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు. హిట్‌మ్యాన్ వెనుదిరిగినా..రాహుల్‌తో కలిసి మంచి శుభారంభాన్ని అందించాడు. 2 ఫోర్లు, ఓ భారీ సిక్సర్‌తో స్కోరు బోర్డు పరుగెత్తించాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీ టీ20 క్రికెట్‌లో 3500 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా అరుదైన ఘనతను అందుకున్నాడు.


Click it and Unblock the Notifications
