Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: ఆ విషయం గురించి టీమిండియా ఆలోచించడం లేదు: జహీర్ ఖాన్

IND vs ENG: Zaheer Khan says India won’t think how much time is left in the Test

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రీషెడ్యూల్ ఐదో టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగించింది. 132 పరుగుల తొలి ఇన్నింగ్స్‌తో ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మూడో రోజు ఆట ముగిసేసమయానికి 45 ఓవర్లలో 3 వికెట్లకు 125 పరుగులు చేసింది. క్రీజులో నయావాల్ చతేశ్వర్ పుజారా(50 బ్యాటింగ్)తో పాటు రిషభ్ పంత్(30 బ్యాటింగ్) ఉన్నాడు.

ప్రస్తుతం భారత్ ఆధిక్యం 257 పరుగులకు చేరుకుంది. అయితే ఈ పరిస్థితుల్లో టీమిండియా.. వర్షం ఆటంకం కలిగిస్తున్న ఈ మ్యాచ్‌లో తమకున్న సమయం గురించి పెద్దగా ఆలోచించడం లేదని మాజీ పేసర్ జహీర్ ఖాన్ అన్నాడు. సాధారణంగానే బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబడుతుందని పేర్కొన్నాడు.

పంత్ చెలరేగుతాడు..

పంత్ చెలరేగుతాడు..

క్రిక్‌బజ్‌తో మాట్లాడిన జహీర్.. మూడో రోజు భారత బ్యాటింగ్‌ను విశ్లేషించాడు. ఇక నాలుగో రోజు పంత్ తనదైన శైలిలో చెలరేగుతాడని చెప్పాడు. 'నాలుగో రోజు ఆటలో పంత్ కచ్చితంగా చెలరేగుతాడు. ఆదివారం ఆటలో పంత్ కాస్త ఓపికగా ఆడాడు. మూడో రోజు ఆటను సానుకూలంగా ముగించాలనే తపనతో పంత్ తనను తాను అదుపులో పెట్టుకున్నాడు. తనకు ముద్దుగా వచ్చిన బంతులను ఫ్లిక్ షాట్స్‌తో బౌండరీకి తరలించాడు. ఈ మ్యాచ్‌లో మిగిలిన సమయం గురించి భారత్ పెద్దగా ఆలోచించడం లేదు.

థ్రిల్లింగ్ సెషన్..

థ్రిల్లింగ్ సెషన్..

సాధారణంగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబడుతూ సానుకూలంగా ముందుకుసాగుతోంది. టెస్ట్ తరహా బ్యాటింగ్ మాత్రమే చేస్తుంది. చివరి సెషన్‌లో ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా బెన్ స్టోక్స్ స్పెల్ అసాధారణం. అండర్స్‌ను కూడా అదరగొట్టాడు. బ్రాడ్, పాట్స్ కూడా కట్టడిగా బౌలింగ్ చేసారు. అందుకే ఎక్కువ పరుగులు, వికెట్లు రాలేదు. టెస్ట్ క్రికెట్‌లోనే ఇది చాలా ఉత్సాహంగా సాగిన సెషన్. బ్యాటర్లు, బౌలర్లు పోటాపోటీగా తలపడ్డారు.'అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ విఫలం..

కోహ్లీ విఫలం..

ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 3 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ (4), వన్‌డౌన్‌ బ్యాటర్‌ విహారి (11) రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశపరిచారు. కోహ్లి 20 పరుగులే చేసి నిష్క్రమించగా, మరో ఓపెనర్‌ చతేశ్వర్‌ పుజారా (139 బంతుల్లో 50 బ్యాటింగ్‌; 5 ఫోర్లు) వికెట్ల ముందు గోడలా నిలబడ్డాడు. హిట్టర్‌ రిషభ్‌ పంత్‌ (46 బంతుల్లో 30 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) తన సహజశైలికి భిన్నంగా నింపాదిగా బ్యాటింగ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ఇద్దరు కలిసి అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. అండర్సన్, బ్రాడ్, స్టోక్స్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

బెయిర్ స్టో సెంచరీ..

బెయిర్ స్టో సెంచరీ..

అంతకుముందు ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో (140 బంతుల్లో 106; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) వీరోచిత సెంచరీతో అదరగొట్టినప్పటికీ భారత బౌలర్లు సిరాజ్‌ (4/66), షమీ (2/78), బుమ్రా (3/68) ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను 61.3 ఓవర్లలో 284 పరుగులకు పరిమితం చేశారు. సామ్‌ బిల్లింగ్స్‌ (36; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగుల ఆధిక్యం లభించింది. ప్రస్తుతం టీమిండియా ఓవరాల్‌ ఆధిక్యం 257 పరుగులకు చేరగా... చేతిలో ఇంకా 7 వికెట్లున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ ఫలితాన్ని శాసించే స్థితికి చేరుకుంది.

Story first published: Monday, July 4, 2022, 15:48 [IST]
Other articles published on Jul 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+