టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఓ టెస్ట్ సిరీస్‌లో 600 ప్లస్ రన్స్ చేసిన తొలి భారత లెఫ్టాండర్‌గా చరిత్రకెక్కాడు. ఇంగ్లండ్‌తో రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా యశస్వి జైస్వాల్ ఈ ఫీట్ సాధించాడు.
ఇంగ్లండ్‌తో ఓ టెస్ట్ సిరీస్‌లో 600 పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ యశస్వి కంటే ముందు ఈ ఫీట్ సాధించారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్.. తాజా మ్యాచ్‌లో సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.

ఈ సిరీస్‌లో మరే బ్యాటర్ కూడా 300 రన్స్ కూడా చేయలేదు. భారత తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్(68 మినహా) మిగతా టాపార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్ శర్మ(2) ఆరంభంలోనే వెనుదిరగ్గా.. శుభ్‌మన్ గిల్(38)తో కలిసి యశస్వి జైస్వాల్ రెండో వికెట్‌కు 82 పరుగులు జోడించాడు.
ఈ జోడీని విడదీసిన షోయబ్ బషీర్.. రజత్ పటీదార్(17)తో పాటు దూకుడుగా ఆడే ప్రతయ్నం చేసిన రవీంద్ర జడేజా(12)ను పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో భారత్ 130 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన సర్ఫఱాజ్ ఖాన్‌తో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ముందుకునడిపిస్తున్నాడు.
అంతకుముందు 302/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 353 పరుగులకు ఆలౌటైంది. 51 పరుగుల వ్యవధిలోనే చివరి మూడు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్ ఓలీ రాబిన్సన్ ధాటిగా ఆడి 81 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అతనితో పాటు షోయబ్ బషీర్(0), జేమ్స్ అండర్సన్(0)లను ఔట్ చేసి జడేజా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
జో రూట్(274 బంతుల్లో 10 ఫోర్లతో 122 నాటౌట్) అజేయ శతకంతో నిలిచాడు. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా(4/67) నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు.