For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: యశస్వి జైస్వాల్ సెంచరీ.. 58 ఏళ్ల రికార్డ్ బద్దలు!

టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. లీడ్స్ మైదానంలో సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్ట్‌లో సెంచరీ చేయడం ద్వారా యశస్వి జైస్వాల్ ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో అతను 58 ఏళ్ల రికార్డ్‌ను అధగమించాడు. యశస్వి జైస్వాల్‌కు ముందు మరే భారత ఓపెనర్ లీడ్స్ మైదానంలో సెంచరీ నమోదు చేయలేదు. 1967లో భారత దిగ్గజ క్రికెటర్ ఫరూక్ ఇంజనీర్ చేసిన 87 పరుగులే.. లీడ్స్ మైదానంలో భారత ఓపెనర్ చేసిన అత్యధిక పరుగులు. ఇన్నాళ్లు చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డ్‌ను జైస్వాల్‌ బద్దలు కొట్టాడు.

అసాధారణ బ్యాటింగ్..

ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన యశస్వి జైస్వాల్ 144 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. 50వ ఓవర్‌లో అతను మూడెంకల స్కోర్ నమోదు చేశాడు. సెంచరీ మార్క్ అందుకోగానే.. గాల్లోకి ఎగిరిన యశస్వి జైస్వాల్ పంచ్‌లు ఇస్తూ.. బిగ్గరగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇది అతనికి ఐదో టెస్ట్ సెంచరీ. మ్యాచ్ ఆరంభం నుంచి తనదైన శైలిలో బ్యాటింగ్ చేసిన యశస్వి జైస్వాల్.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించాడు.

IND vs ENG Yashasvi Jaiswal Becomes First Indian Opener to Score Test Century at Headingley

అరంగేట్ర ప్లేయర్ సాయి సుదర్శన్(0) విఫలమైనా.. కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.96 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న యశస్వి.. మరో 48 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. మధ్యలో క్రాంప్స్‌తో ఇబ్బంది పడినా పరుగుల వేటలో మాత్రం వెనుకడుగు వేయలేదు.సెంచరీ అనంతరం బెన్ స్టోక్స్.. జైస్వాల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 129 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి పంత్ రాగా.. గిల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు.

20 మ్యాచ్‌లు.. 20 వేదికలు..

ఈ మ్యాచ్‌ యశస్వి జైస్వాల్‌కు 20వ టెస్ట్ మ్యాచ్.అయితే ఈ 20 మ్యాచ్‌లను వేర్వేరు వేదికలుగా ఆడాడు. వెస్టిండీస్ గడ్డపై టెస్ట్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన జైస్వాల్.. రోసౌ, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికలుగా రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలో సెంచూరియన్, కేప్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాడు. భారత్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన జైస్వాల్.. ఈ 10 మ్యాచ్‌లను వేర్వేరు వేదికల్లోనే ఆడాడు. ఇందులో రెండు బంగ్లాదేశ్‌పై, మరో మూడు న్యూజిలాండ్‌తో తలపడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్ట్‌లను పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్, మెల్‌బోర్న్, సిడ్నీ వేదికగా ఆడిన యశస్వి జైస్వాల్.. తాజా మ్యాచ్‌ను లీడ్స్ వేదికగా ఆడి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇలా 20 మ్యాచ్‌లను 20 వేదికల్లో ఆడిన తొలి ప్లేయర్‌గా యశస్వి నిలిచాడు.

Story first published: Friday, June 20, 2025, 21:15 [IST]
Other articles published on Jun 20, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+