Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: బద్దకంతో రనౌట్ అయిన హర్మన్‌ప్రీత్ కౌర్! (వీడియో)

IND vs ENG women's Test: భారత మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన బద్దకంతో మరోసారి మూల్యం చెల్లించుకుంది. క్రీజులో బ్యాట్ పెట్టే విషయంలో అలసత్వం ప్రదర్శించి విచిత్రకర రీతిలో రనౌటైంది. ఇంగ్లండ్ మహిళల జట్టుతో ముంబై వేదికగా జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

హర్మన్‌ప్రీత్ కౌర్ అదృష్టమో..బద్దకమో ఏమో కానీ భారత జట్టు అనవసరంగా వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. చార్లీ డీన్ వేసిన 63వ ఓవర్‌ తొలి బంతికి హర్మన్‌ప్రీత్ కౌర్ విచిత్రకర రీతిలో రనౌట్‌‌గా వెనుదిరిగింది. డీన్ వేసిన ఆఫ్ స్టంప్ బాల్‌ను ఆఫ్ సైడ్ ఆడిన హర్మన్ ప్రీత్.. సింగిల్ కోసం క్రీజును ధాటింది.

IND vs ENG womens Test: Harmanpreet Kaur in bizarre run-out after bat sticks in ground

బంతిని ఫీల్డర్ అందుకోవడం గమనించి యూటర్న్ తీసుకుంది. కీపర్ అందుకునే సమయానికే క్రీజులోకి వచ్చిన ఆమె.. బ్యాట్‌ను పెట్టలేకపోయింది. క్రీజులో బ్యాట్‌ ఇరుక్కుపోవడంతో స్లైడ్ చేయలేకపోయింది. దాంతో రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఆమె అలసత్వంతో హాఫ్ సెంచరీని కూడా చేజార్చుకుంది. సరిగ్గా 49 పరుగుల వద్దే వెనుదిరిగింది.

హర్మన్‌ప్రీత్ కౌర్ ఇలా ఔటవ్వడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ ఇలానే రనౌటైంది. క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో నిర్ణీత సమయానికే క్రీజులోకి చేరుకున్నా.. బ్యాట్ స్టక్ అవ్వడంతో రనౌట్ అయ్యింది. ఆమె వికెట్ మ్యాచ్‌ను మలుపుతిప్పింది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది.

మరోసారి హర్మన్‌ప్రీత్ కౌర్ అలానే నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవడంతో అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. ఒక్కసారి అంటే దురదృష్టం.. రెండోసారి కూడా అలానే ఔటైతే.. అది నిర్లక్ష్యమే.. అని మండిపడుతున్నారు. బద్దకానికే బ్రాండ్ అంబాసిడర్ హర్మన్ ప్రీత్ కౌర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 94 ఓవర్లలో 7 వికెట్లకు 410 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(17), షెఫాలీ వర్మ(19) విఫలమైనా.. సతీష్ శుభా(69), జెమీమా రోడ్రిగ్స్(68), యస్తికా భాటియా(66), దీప్తి శర్మ(60 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించగా.. హర్మన్‌ప్రీత్ కౌర్(49) కీలక ఇన్నింగ్స్ ఆడింది. క్రీజులో దీప్తి శర్మతో పాటు పూజవస్త్రాకర్(12 బంతుల్లో 4 నాటౌట్) ఉన్నారు.

ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ రెండు వికెట్లు తీయగా.. నాట్ సీవర్, చార్లీ డీన్, సోఫీ ఎక్లెస్టోన్ తలో వికెట్ తీసారు.

Story first published: Thursday, December 14, 2023, 17:59 [IST]
Other articles published on Dec 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+