IND vs ENG: అందుకే యశస్వి జైస్వాల్, గిల్, పంత్‌పై వేటు!
టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. టెస్ట్ క్రికెట్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ఈ యువ ఓపెనర్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం అవకాశం దక్కడం లేదు. టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా బ్యాకప్ ఓపెనర్‌గా బెంచ్‌కే పరిమితమైన యశస్వి జైస్వాల్.. ఆ తర్వాత జట్టుకే దూరమయ్యాడు.
రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించినా.. టీ20 క్రికెట్‌లో యశస్వి జైస్వాల్‌కు అవకాశాలు దక్కడం లేదు. వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఓపెనర్‌గా అసాధారణ ప్రదర్శన కనబర్చడం.. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతుండటంతో యశస్వి జైస్వాల్‌ను సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు.

జైస్వాల్, గిల్‌పై వేటు..
తాజాగా ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లకు సెలెక్టర్లు భారత జట్టును ప్రకటించాడు. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని 15 మంది సభ్యుల జట్టు వివరాలను శనివారం బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ జట్టులో యశస్వి జైస్వాల్‌తో పాటు టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ అయిన శుభ్‌మన్ గిల్‌పై కూడా వేటు పడింది. రిషభ్ పంత్‌ను కూడా సెలెక్టర్లు పట్టించుకోలేదు.
టీమిండియా చివరగా సౌతాఫ్రికాతో ఆడిన టీ20 సిరీస్‌లో సభ్యులైన ఆవేశ్ ఖాన్, యశ్ దయాళ్, రమణ్‌దీప్ సింగ్, జితేశ్ శర్మలకు కూడా అవకాశం దక్కలేదు. బహుషా ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సిద్దం చేయడం కోసమే జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్‌లను టీ20లకు దూరంగా ఉంచారమోననే వాదన కూడా వినిపిస్తోంది.
ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా తరఫున యశస్వి జైస్వాలే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీ20 ఫార్మాట్‌లోనూ యశస్వి జైస్వాల్‌కు మెరుగైన రికార్డ్ ఉంది. మరోవైపు శుభ్‌మన్ గిల్ దారుణంగా విఫలమయ్యాడు. అయితే సొంతగడ్డపై గిల్‌కు మెరుగైన రికార్డ్ ఉంది.

మహమ్మద్ షమీ రీఎంట్రీ..
గాయంతో గతేడాదిగా జట్టుకు దూరంగా ఉన్న వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ ఎట్టకేలకు రీఎంట్రీ ఇచ్చాడు. టీమిండియా చివరగా సౌతాఫ్రికాతో ఆడిన టీ20 సిరీస్‌లో సభ్యులైన ఆవేశ్ ఖాన్, యశ్ దయాళ్, రమణ్‌దీప్ సింగ్, జితేశ్ శర్మలతో పాటు దాంతో వైస్ కెప్టెన్‌గా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు.
సూర్యకు అతను డిప్యూటిగా వ్యవహరించనున్నాడు. జట్టులో హార్దిక్ పాండ్యా ఉన్నా కూడా అతన్ని కాకుండా అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. లీడర్‌షిప్ గ్రూప్ నుంచి హార్దిక్ పాండ్యాను పూర్తిగా తొలగించారనే వాదన వినిపిస్తోంది.
జనవరి 22 నుంచే..
జనవరి 22 నుంచి భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టీ20 కోల్‌కతా వేదికగా జనవరి 22న జరగనుండగా.. రెండో టీ20 చెన్నై వేదికగా జనవరి 25, మూడో టీ20 రాజ్‌కోట్ వేదికగా జనవరి 28న, నాలుగో టీ20 పుణే వేదికగా జనవరి 31న, ఐదో టీ20 ఫిబ్రవరి 2న ముంబై వేదికగా జరగనుంది. టీ20 మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి.
టీ20 సిరీస్ బరిలోకి దిగే భారత్ జట్టు:
సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తీ, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications