IND vs ENG: అందుకే సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకోలేదు!
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా పిలుపు అందుకున్న యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్.. తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ నేపథ్యంలో రెండో టెస్ట్‌కు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయంతో దూరమవ్వగా.. అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు.
దాంతో సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ అరంగేట్రం ఖాయమని అంతా భావించారు. కానీ వైజాగ్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఈ రెండో టెస్ట్‌లో సర్ఫారాజ్ ఖాన్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ మొండి చెయ్యే చూపించింది. అతనికి బదులు యువ బ్యాటర్ రజత్ పటీదార్‌కు అవకాశం కల్పించింది. దాంతో అతను అంతర్జాతీయ టెస్ట్‌ల్లోకి అరంగేట్రం చేశాడు.

మొత్తం మూడు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా.. జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు అవకాశం కల్పించింది. మహమ్మద్ సిరాజ్‌ను విశ్రాంతి పేరిట పక్కనపెట్టి ముఖేష్ కుమార్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఇక సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను తప్పబడుతూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొనే సర్ఫరాజ్ ఖాన్‌కు బదులు రజత్ పటీదార్‌కు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీమిండియా మేనేజ్‌మెంట్ నిలకడకు ప్రాధాన్యమిచ్చినట్లు అర్థమవుతోంది.
అసలే శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ పేలవ ఫామ్‌తో సతమతమవుతుండటంతో మిడిలార్డర్‌లో నిలకడగా బ్యాటింగ్ చేయగల రజత్ పటీదార్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. పైగా అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో 111, 151 రెండు శతకాలు బాదాడు. క్లిష్ట పరిస్థితుల్లో అసాధారణ బ్యాటింగ్‌తో శతకం సాధించాడు.
మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. అతను కూడా ఇంగ్లండ్ లయన్స్‌తో శతకం బాదినప్పటికీ నిలకడగా మాత్రం రాణించలేదు. పైగా సర్ఫరాజ్ ఖాన్ వయసు 26 ఏళ్లే కావడంతో అతని కంటే ఎక్కువ వయసు కలిగిన రజత్ పటీదార్(30) వైపు టీమిండియా మేనేజ్‌మెంట్ మొగ్గు చూపింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ(14), శుభ్‌మన్ గిల్(34) వికెట్లను త్వరగా కోల్పోయినా.. శ్రేయస్ అయ్యర్(27 బ్యాటింగ్)తో కలిసి మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(104 బ్యాటింగ్) సూపర్ సెంచరీ బాదడంతో భారీ స్కోర్ దిశగా నడుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications