For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: బజ్‌బాల్ అంటే ఏమిటి..? ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఐదు టెస్ట్‌ల సిరీస్ నేపథ్యంలో అభిమానులకు బాగా వినిపిస్తున్న పేరు 'బజ్‌బాల్'. దూకుడైన ఇంగ్లండ్ బ్యాటింగ్‌ తీరు వివరిస్తూ ఈ పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. టెస్ట్ క్రికెట్‌లో దూకుడుగా ఆడటమే బజ్‌బాల్ అర్థం. ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ముద్దు పేరు బజ్ నుంచి ఈ పదం పుట్టుకొచ్చింది.

అయితే ఆరంభంలో బజ్‌బాల్ పదాన్ని ఉపయోగించడాన్ని ఇంగ్లండ్ టీమ్‌తో పాటు బ్రెండన్ మెక్‌కల్లమ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇది తమను కించపరిచేలా ఉందని మండిపడ్డాడు. కానీ ఇప్పుడు ఇంగ్లండ్ ఆటగాళ్లే బజ్‌బాల్ అప్రోచ్ అంటూ గర్వంగా మాట్లాడుతున్నారు. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డక్కెట్ అయితే.. తమ బజ్‌బాల్ అప్రోచ్‌ను చూసి ఇతర జట్లు నేర్చుకుంటున్నాయని కామెంట్ చేశాడు.

IND vs ENG: What is Bazball and where did it come from?

బజ్‌‌బాల్ పేరు ఎలా వచ్చిందంటే..?
ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో యూకే ఎడిటర్ ఆండ్రూ మిల్లర్ తొలిసారి ఈ బజ్‌బాల్ పదాన్ని ఉపయోగించారు. ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఇంగ్లండ్ టెస్ట్ బ్యాటింగ్ అప్రోచ్‌ను వివరిస్తూ ఈ పదాన్ని ప్రయోగించారు. మెక్‌కల్లమ్ ముద్దు పేరు బజ్‌ నుంచి ఈ పదం పుట్టుకొచ్చింది.

ఆరంభంలో మెక్‌కల్లమ్‌తో పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ పద ప్రయోగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెక్‌కల్లమ్ అయితే ఈ పదానికి అర్థం ఏంటో తనకు తెలియదని, అర్థం పర్థం లేని పదమని మండిపడ్డాడు.

బజ్‌బాల్ అంటే ఏంటంటే..?
టెస్ట్‌ క్రికెట్‌ అంటే చాలా నెమ్మదిగా సాగే ఫార్మాట్‌. పరిస్థితులకు తగ్గట్లు ఆడటం ఈ ఫార్మాట్ స్టైల్. అయితే పరిస్థితులతో సంబంధం లేకుండా.. ప్రత్యర్థి ఎవరా? బౌలర్ ఎవరా? అనేది పట్టించుకోకుండా దూకుడుగా బ్యాటింగ్ చేయడమే బజ్‌బాల్ విధానం. 2019- 2022 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఇంగ్లండ్ దారుణంగా విఫలమైంది. యాషెస్ సిరీస్‌తో పాటు భారత్ చేతిలో చిత్తయ్యింది.

ఈ వరుస పరాజయాల నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు జట్టును ప్రక్షాళన చేసింది. హెడ్ కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్, కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ నియమించింది. ఈ ఇద్దరిది దూకుడుగా బ్యాటింగ్ చేసే శైలి. దాంతో ఇంగ్లండ్ జట్టుకు దూకుడు అలవాటు చేశారు. ఎంతలా అంటే.. జిడ్డు బ్యాటింగ్‌తో అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్ చేసే జోరూట్‌‌ కూడా సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడేలా మార్చారు.

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో బజ్‌బాల్ విధానాన్ని మొదలుపెట్టారు. ఆ జట్టు 500 ప్లస్ స్కోర్ చేసినా దూకుడుగా బ్యాటింగ్ చేసి విజయాన్ని అందుకున్నారు. అదే జోరును తర్వాతి సిరీస్‌ల్లోనూ కొనసాగించారు. పాకిస్థాన్ గడ్డపై సత్తా చాటారు. యాషెస్ సిరీస్‌లోనూ ఇదే తరహా బ్యాటింగ్‌తో ఆసీస్‌ను వణికించారు. మొత్తానికి ఈ బ్యాటింగ్ అప్రోచ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

అయితే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లపై మాత్రం బజ్‌బాల్ అప్రోచ్ పని చేస్తోంది. టర్నింగ్ ట్రాక్స్ ఉంటే భారత్‌లో బజ్‌బాల్ బ్యాక్ ఫైర్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ పదంపై తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే ఇంగ్లండ్ కంటే ముందే టెస్ట్‌ల్లో ఆసీస్ దూకుడుగా బ్యాటింగ్ చేసింది. రికీ పాంటింగ్ సారథ్యంలోని జట్టు 2000-2004 మధ్య ఇదే తరహా దూకుడుతో విజయాలను అందుకుంది. భారత్‌లో వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఇదే అప్రోచ్‌తో ట్రిపుల్ సెంచరీలు సాధించాడు.

Story first published: Wednesday, February 21, 2024, 21:35 [IST]
Other articles published on Feb 21, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+