Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: మ్యాచ్ విన్నర్‌ను పక్కన పెట్టారు.. సెలెక్టర్లపై సెహ్వాగ్ ఫైర్

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌‌ను ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయకపోవడాన్ని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తప్పుబట్టాడు. మ్యాచ్ విన్నర్ అయిన శ్రేయస్ అయ్యర్‌ను పక్కనపెట్టి సెలెక్టర్లు తప్పు చేశారని తెలిపాడు. శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడని, అతన్ని టెస్ట్ టీమ్‌లోకి తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది.

18 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. దేశవాళీ క్రికెట్‌లో శ్రేయస్ అయ్యర్ నిలకడగా రాణించినా.. ప్రస్తుత జట్టులో అతనికి చోటు లేదని అగార్కర్ వివరణ ఇచ్చాడు. శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడంపై ఓ ఛానెల్‌లో మాట్లాడిన సెహ్వాగ్ సెలెక్టర్ల తీరును తప్పుబట్టాడు. ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి తగిన గుర్తింపు లభించడం లేదని అభిప్రాయపడ్డాడు.

IND vs ENG Virender Sehwag Slams Shreyas Iyer s Snub from India s England Test Squad

అయ్యర్‌కు రావాల్సిన పేరు రావడం లేదు..
'శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి తగిన గుర్తింపు లభించడం లేదు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రిషభ్ పంత్ విఫలవడంతోనే అతనికి టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ దక్కలేదని మనోజ్ తివారి అన్నాడు. కానీ శ్రేయస్ అయ్యర్‌కు ఈ సీజన్‌ అద్భుతంగా సాగింది. అతను ఓ కెప్టెన్ కూడా. అయినా అయ్యర్ టెస్ట్ క్రికెట్ ఎందుకు ఆడలేడు? మూడు ఫార్మాట్లలో ఆడగలే సత్తా అతనికి ఉంది. ప్రస్తుతం అయ్యర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతన్ని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయాల్సింది.

ఫామ్‌లో ఉన్న ఆటగాడు..
ఎందుకంటే అయ్యర్ రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నేను అతన్ని టెస్ట్ టీమ్‌లో చూడాలనుకుంటున్నాను. టెస్ట్ క్రికెట్‌లో అతను అదే జోరును కొనసాగిస్తే, భారత జట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. జట్టులో ఇద్దరు, ముగ్గురు దూకుడుగా ఆడే ఆటగాళ్లు ఉంటే.. ప్రత్యర్థి వెన్నులో వణుకు పుడుతోంది. ఇంగ్లండ్ బజ్ బాల్ పేరిట ఓవర్‌కు 6-7 పరుగులు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ కనీసం ఓవర్‌కు 4-5 పరుగులు చేసినా.. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒత్తిడికి గురవుతారు.'అని వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు.

దేశవాళీలోనూ రాణించిన అయ్యర్..
శ్రేయస్ అయ్యర్ 14 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 36.86 సగటుతో 811 పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలతో పాటు ఒక సెంచరీ ఉంది. గతేడాది ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ చివరి మ్యాచ్ ఆడాడు. రంజీ ట్రోఫీ 2024-25లో ముంబై తరఫున శ్రేయస్ అయ్యర్ 68.75 సగటుతో 480 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లోనూ అయ్యర్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 48.80 సగటుతో 488 పరుగులు చేశాడు.

Story first published: Sunday, May 25, 2025, 14:13 [IST]
Other articles published on May 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+