Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: ఆట మొదలు.. లొల్లి షురూ! కోహ్లీX బెయిర్‌స్టో డిష్యూం డిష్యూం!(వీడియో)

IND vs ENG: Virat Kohli Warns Baristow And Umpires Intervene

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రీ షెడ్యూల్ ఐదో టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభమైంది. 85/5 ఓవర్‌నైట్‌స్కోర్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నిలకడగా ఆడుతోంది. అయితే మూడో రోజు ఆట ప్రారంభంలోనే ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో గొడవపడగా.. అంపైర్లు జోక్యం చేసుకొని సముదాయించారు.

మహమ్మద్ షమీ వేసిన 32వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌లో బెయిర్ స్టో తడబడటం చూసి కోహ్లీ నవ్వుకున్నాడు. దాంతో బెయిర్ స్టో ఆగ్రహం వ్యక్తం చేయగా.. కోహ్లీ కూడా ధీటుగా బదులిచ్చాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య మాటల యుద్దం నడిచింది. బెయిర్ స్టో బంతిని తప్పా మైదానంలో ప్రతీది స్పష్టంగా చూస్తున్నాడని కోహ్లీ అనడం స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. అయితే ఈ ఓవర్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇద్దరి మధ్య సయోద్య కుదుర్చాడు. ఇద్దరిని పిలిచి మాట్లాడటంతో గొడవ సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

మహమ్మద్ షమీ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను శార్దూల్ ఠాకూర్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో స్టోక్స్, బెయిర్ స్టోతో కలిసి చెలరేగుతున్నాడు. ఈ ఇద్దరూ వన్డే తరహా బ్యాటింగ్ చేస్తుండటంతో జట్టు స్కోర్ పరుగెడుతోంది. ప్రస్తుతం 37 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 148 పరుగులు చేసింది. జానీ బెయిర్ స్టో(50 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. స్టోక్స్(25 బ్యాటింగ్) ఆ దిశగా సాగుతున్నాడు. ఇంగ్లండ్ ఇంకా 268 పరుగుల వెనుకంజలో ఉంది.

రెండో రోజు ఆటలో రవీంద్ర జడేజా (194 బంతుల్లో 13 ఫోర్లతో 104) సెంచరీకి.. బుమ్రా (31 నాటౌట్‌;) 16 బంతుల్లో 4X4, 2X6) మెరుపులు తోడవడంతో స్కోరు 400 దాటింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 416 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లిష్‌ బౌలర్లలో అండర్సన్‌ (5/60) ఉత్తమ ప్రదర్శన చేశాడు.

Story first published: Sunday, July 3, 2022, 16:25 [IST]
Other articles published on Jul 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+