Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: విరాట్ కోహ్లీ X జేమ్స్ అండర్సన్.. పరుగుల రారాజు X వికెట్ల వీరుడి ఆఖరి సమరం!

 IND vs ENG: Virat Kohli vs James Anderson for one last time from tomorrow at Edgbaston

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ దశాబ్దకాలంగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకున్నారు. కొన్నిసార్లు పరుగుల రారాజు విరాట్ కోహ్లీ పై చేయి సాధిస్తే మరికొన్ని సార్లు అండర్సన్ ఆధిపత్యం చెలాయించాడు. ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్టులో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో వారిద్దరూ తలపడేది ఇదే చివరి మ్యాచ్‌ అయ్యేలా కనిపిస్తోంది. దాంతో అభిమానులు వీరి వైరాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

 2012లో తొలిసారి..

2012లో తొలిసారి..

సరిగ్గా 10 ఏళ్ల క్రితం(2012) తొలిసారి విరాట్‌, అండర్సన్ టెస్టుల్లో తలపడ్డారు. అప్పుడు ఇంగ్లండ్‌ భారత పర్యటనకు వచ్చినప్పుడు తొలిసారి అండర్సన్‌ కింగ్‌ కోహ్లీని ఔట్‌ చేశాడు. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ (6) పరుగులకే పెవిలియన్‌ చేరాడు. అండర్సన్‌ వేసిన బంతి బ్యాట్‌ అంచున తాకుతూ వెళ్లి స్లిప్‌లో ఉన్న గ్రేమ్‌ స్వాన్‌ చేతుల్లో పడింది. ఔట్‌సైడ్‌ స్వింగ్‌ వేసిన బంతితో ఇంగ్లండ్‌ పేసర్‌ బోల్తా కొట్టించాడు. ఆ క్షణమే మొదలైన వీరి వైరం.. దశాబ్దకాలం కావస్తున్నా ఇంకా కొనసాగుతోంది.

నాలుగుసార్లు ఔట్..

నాలుగుసార్లు ఔట్..

కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చాక 2014 ఇంగ్లాండ్‌ పర్యటనలో తొలిసారి విఫలమయ్యాడు. ఆ సిరీస్‌లో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 134 పరుగులే చేశాడు. ఒక్క అర్ధ శతకం కూడా చేయలేకపోయాడు. ఆ పర్యటనలో మానసికంగానూ కుంగిపోయాడు. మరీ ముఖ్యంగా అండర్సన్‌ బౌలింగ్‌లో నాలుగు సార్లు పెవిలియన్‌ చేరడం చర్చనీయాంశమైంది. అన్నీ ఔట్‌సైడ్‌ ఎడ్జ్‌ బంతులకే ఔటవ్వడం మరో విశేషం. పేస్‌ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై అండర్సన్‌ ఔట్‌ స్వింగర్‌ బంతులేసి విరాట్‌పై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించాడు. దీంతో ఈ సిరీస్‌ కోహ్లీ కెరీర్‌లోనే ఓ పీడకలలా మారిపోయింది. తర్వాత దాన్నుంచి బయటపడటానికి బాగానే కష్టపడ్డాడు.

సెంచరీలతో బదులు..

సెంచరీలతో బదులు..

అయితే, ఇంగ్లండ్‌తో తర్వాత జరిగిన రెండు సిరీస్‌ల్లోనూ విరాట్‌.. అండర్సన్‌కు వికెట్‌ ఇవ్వకపోవడం చెప్పుకోదగ్గ విశేషం. 2014లో తన వైఫల్యాల నుంచి మంచి పాఠాలే నేర్చుకున్న అతను.. ఇంగ్లండ్‌ పేసర్‌ను ఎలా ఎదుర్కోవాలనేదానిపైనా ప్రత్యేక దృష్టిసారించాడు. దీంతో 2016 ఆ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు విరాట్‌ రెచ్చిపోయాడు. ఆ సిరీస్‌లో ఒక శతకం, ఒక ద్విశతకంతో మొత్తం 655 పరుగులు చేశాడు. అలాగే 2018లో టీమిండియా ఇంగ్లాండ్‌కు వెళ్లినప్పుడు రెండు శతకాలతో మొత్తం 593 పరుగులు చేశాడు. ఈ రెండు సిరీస్‌ల్లోనూ మొత్తం కలిపి 10 మ్యాచ్‌లు జరగ్గా.. అండర్సన్‌ 8 మ్యాచ్‌లు ఆడాడు. అయినా, ఒక్కసారి కూడా విరాట్‌ను ఔట్‌ చేయలేకపోయాడు.

చివరిసారి ఎవరిదో ఆధిపత్యం..

చివరిసారి ఎవరిదో ఆధిపత్యం..

ఇక గతేడాది ఇదే సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఇద్దరూ సమంగా నిలిచారు. అప్పటికే కోహ్లీ ఫామ్‌లో లేకపోయినా ఇంగ్లండ్‌ గడ్డపై రెండు అర్ధశతకాలతో నామమాత్రంగానైనా రాణించాడు. అయితే, అండర్సన్‌.. తొలి, మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ల్లో రెండుసార్లు పెవిలియన్‌కు పంపాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో విరాట్‌ 218 పరుగులు చేశాడు. ఇక ఇప్పుడు జరిగే ఐదో టెస్టులో ఎవరు పైచేయి సాధిస్తారన్నదే ఆసక్తిగా మారింది.

Story first published: Thursday, June 30, 2022, 21:00 [IST]
Other articles published on Jun 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+