IND vs ENG: ‘నువ్వేం మనిషివి రా అయ్యా’.. అంపైర్ ఆకస్మిక నిర్ణయంపై కోహ్లీ ఫైర్ (వీడియో)

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రిషెడ్యూల్ ఐదో టెస్ట్‌లో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఓ వైపు వరుణుడు ఆటంకం కలిగిస్తున్న మరోవైపు సాధ్యపడ్డ కొంచెం ఆటలో భారత్ దుమ్మురేపింది. కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ఆల్‌రౌండ్ షో కనబర్చడంతో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్, రవీంద్ర జడేజా సెంచరీలతో 416 పరుగుల భారీ స్కోరు సాధించిన టీమిండియా.. ఇంగ్లిష్ జట్టును 85/5కు కట్టడి చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో అంపైర్ తీసుకున్న ఓ ఆకస్మిక నిర్ణయంపై మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. కోపంతో ఊగిపోయిన విరాట్.. పరుష పదాలను వాడాడు. అవి కాస్త స్టంప్ మైక్‌లో రికార్డవ్వడంతో చర్చనీయంశమయ్యాయి.
అసలేం జరిగిందంటే..
ఆట రెండో రోజు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మహమ్మద్ షమీ నాలుగో ఓవర్ వేసేందుకు సిద్దమయ్యాడు. తొలి బంతి వేసేందుకు అతను రనప్ పూర్తి చేయగా.. అంపైర్ ఆటను నిలిపివేస్తున్నట్లు సిగ్నల్ ఇచ్చాడు. దాంతో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ క్రీజు నుంచి తప్పుకోని పక్కకు జరిగాడు. ఇక షమీ మాత్రం బంతిని పూర్తి చేయగా.. అంపైర్ డెడ్‌బాల్‌గా ప్రకటించాడు. ఈ చర్యతో విరాట్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. 'నువ్వేం మనిషివి రా అయ్యా.. బంతి వేసేటప్పుడు మ్యాచ్ ఆపుతావ్'అంటూ మండిపడ్డాడు. బంతి వేసేటప్పుడు మధ్యలో ఎలా ఆపుతారని ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలు కాస్త స్టంప్ మైక్‌లో రికార్డు అవ్వగా.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
బుమ్రాకు అండగా..
కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నా జస్‌ప్రీత్ బుమ్రాకు విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు. మైదానంలో ఫీల్డ్ సెటప్, బౌలింగ్ మార్పుల విషయంలో సాయం చేశాడు. విరాట్ జోక్యాన్ని అభిమానులు కొనియాడుతున్నారు. ఇక వ్యక్తిగతంగా మాత్రం విరాట్ దారుణంగా విఫలమయ్యాడు. ఎన్నో అంచనాల మధ్యలో బరిలోకి దిగిన అతను కేవలం 11 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు.
332 పరుగుల వెనుకంజలో..
రెండో రోజు ఆటలో రవీంద్ర జడేజా (194 బంతుల్లో 13 ఫోర్లతో 104) సెంచరీకి.. బుమ్రా (31 నాటౌట్;) 16 బంతుల్లో 4X4, 2X6) మెరుపులు తోడవడంతో స్కోరు 400 దాటింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 416 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లిష్ బౌలర్లలో అండర్సన్ (5/60) ఉత్తమ ప్రదర్శన చేశాడు. అనంతరం బుమ్రా (3/35) బంతితోనూ అదరగొట్టడంతో ఇంగ్లాండ్ 84/5తో కష్టాల్లో పడింది. కీలకమైన రూట్ (31) వికెట్‌ను సిరాజ్ (1/5) పడగొట్టాడు. 5 వికెట్లు చేతిలో ఉన్న ఇంగ్లిష్ జట్టు.. ఇంకా 332 పరుగులు వెనుకబడి ఉంది. ఆట ఆఖరుకు బెయిర్‌స్టో (12), స్టోక్స్ (0) క్రీజులో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications