
ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు. తొలి రోజు ఆటలో ఆతిథ్య జట్టు ఓపెనర్ హసీబ్ హమీద్ చేసిన పని పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన విరాట్ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అసలేం జరిగిందంటే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్బంగా హసీబ్ హమీద్ క్రీజు బయట ఉన్న ప్రదేశంలో గార్డు తీసుకున్నాడు. అక్కడ కాలితో మార్క్ చేశాడు.
అతను చేసిన పనికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెంటనే అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. క్రీజు బయట ఎలా గార్డు తీసుకుంటాడని.. అది పిచ్‌ను పాడుచేయడం కిందకే వస్తుందని వాదించాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌తో ఈ విషయంపై కోహ్లీ సుదీర్ఘంగా వాదన పెట్టుకున్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందే ఇదంతా జరిగింది.
క్రీజు వెలుపల తన స్పైకింగ్ షూస్‌తో హమీద్ గార్డు తీసుకోవడానికి కోహ్లీ తీవ్రంగా వ్యతిరేకించాడు. సాధారణంగా క్రీజ్ లోపల బ్యాట్ లేదా షూస్‌తో గార్డును మార్కు చేస్తుంటారు. కొంత మంది బెయిల్స్ తీసుకొని అక్కడ మార్క్ చేస్తుంటారు. కానీ క్రీజ్ వెలుపల డేంజర్ జోన్‌లో గార్డు చేయడాన్ని కోహ్లీ తీవ్రంగా వ్యతిరేకించాడు. మూడో టెస్టులో రిషభ్ పంత్ కూడా క్రీజ్ వెలుపల నిలబడి బ్యాటింగ్ చేయడాన్ని అంపైర్ నిరాకరించాడు. డేంజర్ జోన్‌లో నిలబడి బ్యాటింగ్ చేయవద్దని హెచ్చరించాడు. అంపైర్ సూచనలతో పంత్ గార్డు మార్చుకొని క్రీజులోనే నిలబడి తర్వాతి బంతికే ఔటయ్యాడు. అంపైర్ తనను వారించడం వల్లే ఔటయ్యానని రిషభ్ పంత్ కూడా అప్పుడు చెప్పుకొచ్చాడు. అయితే ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ హమీద్ బయట గార్డు మార్క్ చేసిన అంపైర్లు పట్టించుకోక పోవడం వల్లే కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేసాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 61.3 ఓవర్లలో 191 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (96 బంతుల్లో 8 ఫోర్లతో 50), శార్దుల్ ఠాకూర్ (36 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. రాబిన్సన్‌కు 3 వికెట్లు దక్కాయి. షమీ, ఇషాంత్‌ల స్థానాల్లో వచ్చిన శార్దుల్, ఉమేశ్ తమ ఎంపికకు న్యాయం చేశారు. తొలి ఇన్నింగ్స్‌ను ఉత్సాహంగా ప్రారంభించిన ఇంగ్లండ్‌పై బుమ్రా (2/15) నిప్పులు చెరిగాడు. బర్న్స్ (5)ను బౌల్డ్ చేశాడు. హమీద్ (0)ను కీపర్ పంత్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. ఉమేశ్ అత్యంత కీలకమైన సెంచరీల మాస్టర్, కెప్టెన్ రూట్ (21)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు.
53/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్ (31), ఒవర్టన్ (1 )వికెట్లను కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఈ ఇద్దరు పెవిలియన్ చేరారు. దాంతో క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో, ఓలీపోప్ ధాటిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ఇప్పటికే 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు.