For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీకి ఆ ముద్దుపేరు ఎలా వచ్చింది.. ఎవరు ఫేమస్‌ చేశారో తెలుసా?!!

IND vs ENG: Virat Kohli reveals story behind his nickname Chiku
అతని వల్లే Virat Kohli ముద్దు పేరుకి అంత పాపులారిటీ..! || Oneindia Telugu

హైదరాబాద్: ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అసలు పేరుతో పాటు నిక్​నేమ్ (ముద్దుపేరు) కూడా ఒకటి ఉంటుంది. కొందరికి పుట్టుకతో తల్లిదండ్రులు పెడితే.. మరికొందరికి వారి చేష్టల వల్ల, ప్రవర్తన వల్ల నిక్ ​నేమ్​లు పుట్టుకొస్తుంటాయి. అందరిలానే టీమిండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీకి కూడా ఓ నిక్​నేమ్​ ఉంది. అదే 'చీకూ'. అయితే ఆ పేరు అతడికి ఎవరు పెట్టారు?, దాని వెనక ఉన్న విషయాలను ఏంటో ఓసారి పరిశీలిద్దాం. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీనే ఓసారి చెప్పాడు. ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. లార్డ్స్ టెస్ట్ గెలిచిన భారత్.. 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

 కోహ్లీ ముద్దు పేరు 'చీకూ'

కోహ్లీ ముద్దు పేరు 'చీకూ'

విరాట్ కోహ్లీ ముద్దు పేరు 'చీకూ' అన్న విషయం తెలిసిందే. కానీ ఈ పేరు పాపులర్​ కావడానికి కారణం మాత్రం భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీనే. ఆటలో భాగంగా కోహ్లీని పిలవడానికి చీకూ అనే పేరునే తరచూ మహీ ఉపయోగించేవాడు. వికెట్ల వెనక నుంచి పదే పదే పిలవడం ద్వారా అది కాస్త స్టంప్స్​ మైక్​లో రికార్డయింది. దీంతో ఈ నోటా ఆ నోటా ఆ నిక్​నేమ్​ అందరికీ తెలిసిపోయింది. మొత్తానికి కోహ్లీ ముద్దుపేరు మహీ ద్వారానే ప్రపంచానికి తెలిసింది. అయితే విరాట్​కు ఆ పేరును పెట్టింది మాత్రం తన చిన్ననాటి కోచ్​. అతనే మొదటిసారిగా ఆ నిక్​నేమ్​తో పిలిచాడట.

బుగ్గలు, చెవులు పెద్దగా ఉండడంతో

బుగ్గలు, చెవులు పెద్దగా ఉండడంతో

గతేడాది లాక్‌డౌన్ సమయంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్‌ పీటర్సన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌చాట్‌లో విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య అనేక విషయాలు చర్చకు వచ్చాయి. క్రమంలోనే తన ముద్దు పేరు ఎలా ఫేమస్‌ అయిందో కోహ్లీ చెప్పాడు. 'రంజీ ట్రోఫీ ఆడే రోజుల్లో అక్కడి కోచ్‌ నాకు 'చీకూ' అనే ముద్దుపేరు పెట్టారు. అప్పట్లో నాకు పెద్ద బుగ్గలు ఉండేవి. 2007లో జుట్టు ఊడిపోతుంటే చిన్నగా హెయిర్‌కట్‌ చేయించుకున్నా. దాంతో నా బుగ్గలు, చెవులు పెద్దగా కనిపించేవి. కార్టూన్‌లోని ఓ కుందేలు పాత్ర పేరు చంపక్‌. దాంతో నాకు ఆ పేరు వచ్చింది' అని కోహ్లీ తెలిపాడు.

IND vs ENG:'పుజారా, రహానే కంటే అతనే బెస్ట్ ప్లేయర్..ఫాస్ట్‌గా సెంచరీలు చేయగలడు!మూడో టెస్టులో ఆడించండి'

ధోనీనే ఫేమస్‌ చేశాడు

ధోనీనే ఫేమస్‌ చేశాడు

అయితే చీకూ అనే పేరును టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫేమస్‌ చేశాడని విరాట్ కోహ్లీ చెప్పాడు. 'నా ముద్దుపేరు అంద‌రికీ తెలిసేలా చేసింది మాత్రం ఎంఎస్ ధోనీనే. వికెట్ల వెనుక నుంచి మ‌హీ త‌రచూ న‌న్ను చీకూ, చీకూ అని పిలువ‌డం.. అది స్టంప్స్ మైక్‌లో రికార్డ‌వ‌డంతో అంద‌రికీ తెలిసిపోయింది' అని కోహ్లీ చెప్పాడు. కోహ్లీ అన్ని ఫార్మాట్‌లలో పరుగుల ప్రవాహం పారించడంతో.. అతన్ని 'రికార్డుల రారాజు', 'పరుగుల యంత్రం' అని కూడా పిలుస్తారు.

25న రెండో టెస్ట్ ఆరంభం

25న రెండో టెస్ట్ ఆరంభం

ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 25న లీడ్స్‌ వేదికగా ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ కోసం భారత జట్టు ఆదివారం లీడ్స్ చేరుకుంది. చేరుకోవడమే ఆలస్యం అప్పుడే ప్రాక్టీస్ మొదలెట్టింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ లోకేష్ రాహుల్. వైస్ కెప్టెన్ అజింక్య రహానేలు హెడింగ్లీ స్టేడియంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు.

ముఖ్యంగా కోహ్లీ ప్రాక్టీస్ సెషన్‌లో చమటోడ్చాడు. పేసర్లు మొహ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్.. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు బౌలింగ్ సాధన చేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌కు సంబందించిన కసరత్తులు చేయగా.. వికెట్ కీపర్ రిషబ్ పంత్ క్యాచులు ప్రాక్టీస్ చేశాడు. టీమిండియా సాధనకు సంబందించిన ఫొటోలను బీసీసీఐ తన అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Story first published: Monday, August 23, 2021, 15:48 [IST]
Other articles published on Aug 23, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+