For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG:'పుజారా, రహానే కంటే అతనే బెస్ట్ ప్లేయర్..ఫాస్ట్‌గా సెంచరీలు చేయగలడు!మూడో టెస్టులో ఆడించండి'

IND vs ENG 3rd Test: Farokh Engineer picks Suryakumar Yadav in place of Cheteshwar Pujara

ముంబై: ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ డ్రాగా ముగియగా.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లార్డ్స్ టెస్టులో అనూహ్య విజయం సాధించిన భారత్ సిరీసులో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఈ నెల 25న లీడ్స్‌ వేదికగా ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ కోసం భారత జట్టు ఆదివారం లండన్ నుంచి లీడ్స్ చేరుకుంది. కోహ్లీసేన అప్పుడే ప్రాక్టీస్ మొదలెట్టింది. టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ సెషన్‌లో చమటోడ్చుతున్నారు.

పుజారా. రహానే విఫలం

పుజారా. రహానే విఫలం

అయితే ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగియగా.. టెస్ట్ స్పెసలిస్ట్ బ్యాట్స్‌మన్‌లు చేటేశ్వర్ పుజారా, అజింక్య రహానే చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ చేయలేదు. ముఖ్యంగా పుజారా నెమ్మది ఇన్నింగ్స్‌తో టాప్ ఆర్డర్‌పై ఒత్తిడి పెంచుతున్నాడు. రెండు టెస్టుల్లో కలిపి 70 పరుగులు మాత్రమే చేశాడు.

మరోవైపు మిడిలార్డర్‌లో రహానే భాగస్వామ్యాలను నిర్మించడంలో ఫెయిలవుతున్నాడు. దాంతో లీడ్స్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టుకి ఈ ఇద్దరిలో ఒకరిఫై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. పుజారాపై వేటు వేసి సూర్యకుమార్ యాదవ్‌కి తుది జట్టులో తీసుకోవాలి టీమిండియా మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సూచించాడు.

సూర్యను ఆడించాలి

సూర్యను ఆడించాలి

తాజాగా ఫరూక్ ఇంజినీర్ ఓ స్పోర్ట్స్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. 'ముందుగా ఒకటి చెప్పాలి. నేను సూర్యకుమార్ యాదవ్‌కి పెద్ద అభిమానిని. అతను ఓ క్లాస్ ప్లేయర్. చేటేశ్వర్ పుజారా, అజింక్య రహానే కూడా క్లాస్ ఆటగాళ్లే. కానీ సూర్యకుమార్ మ్యాచ్ విన్నర్. మూడో టెస్టులో పుజారా, రహానే ఇద్దరిలో ఒకరికి బదులుగా సూర్యకుమార్ యాదవ్‌ ఆడాలని నేను ఆశిస్తున్నా. సూర్య చాలా దూకుడుగా ఆడతాడు. వేగంగా 70-80 పరుగులు చేయడంతో పాటు.. ఫాస్ట్‌గా సెంచరీలు కూడా నమోదు చేయగలడు. సూర్య అద్భుతమైన బ్యాట్స్‌మన్. అలానే మంచి ఫీల్డర్ కూడా. అంతకుమించి మంచి మనిషి కూడా' అని అన్నాడు.

అరంగేట్రం ఛాన్స్ దక్కేనా

అరంగేట్రం ఛాన్స్ దక్కేనా

ఇటీవలే శ్రీలంక టూర్‌ని ముగించుకుని.. ఆ తర్వాత 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్న పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ తాజాగా ఇంగ్లండ్‌లోని భారత్ జట్టుతో చేరారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్టుబట్టి మరీ పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లను ఇంగ్లండ్‌కి పిలిపించాడు. కానీ లార్డ్స్ టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ సాధించడం ద్వారా ఓపెనింగ్ స్థానాన్ని అతడు పదిలం చేసుకున్నాడు. దాంతో పృథ్వీ షా మూడో టెస్టులో రిజర్వ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అయితే పుజారా స్లో ఇన్నింగ్స్‌పై గుర్రుగా ఉన్న కోహ్లీ.. సూర్యకుమార్ యాదవ్‌కి టెస్టుల్లో అరంగేట్రం ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.

IND vs ENG: లీడ్స్‌లో ప్రాక్టీస్ మొదలెట్టిన భారత్.. చమటోడ్చుతున్న కోహ్లీ, రాహుల్! పంత్, రోహిత్ అయితే..!!

https://telugu.mykhel.com/cricket/ind-vs-eng-team-india-begins-training-at-headingley-stadium-ahead-of-3rd-test-in-leeds-036874.html

జోరుగా ప్రాక్టీస్

జోరుగా ప్రాక్టీస్

మూడో టెస్ట్ కోసం భారత ఆందరూ కలిసి ఆదివారం ఉదయమే లీడ్స్‌ చేరుకొని.. సాయంత్రం హెడింగ్లీ స్టేడియంలో ప్రాక్టీస్ చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ లోకేష్ రాహుల్. వైస్ కెప్టెన్ అజింక్య రహానేలు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా కోహ్లీ ప్రాక్టీస్ సెషన్‌లో చమటోడ్చాడు. పేసర్లు మొహ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్.. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు బౌలింగ్ సాధన చేశారు. ఇక ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌కు సంబందించిన కసరత్తులు చేయగా.. వికెట్ కీపర్ రిషబ్ పంత్ క్యాచులు ప్రాక్టీస్ చేశాడు. టీమిండియా సాధనకు సంబందించిన ఫొటోలను బీసీసీఐ తన అధికార ట్విట్టర్ ఖాతాలో ఉంచింది.

 జడేజా విఫలం

జడేజా విఫలం

లార్డ్స్ టెస్ట్ విజయంతో 1-0తో ఆధిక్యంలో వెళ్లిన కోహ్లీసేన మూడో టెస్టులో కూడా అదే జోరును కొనసాగించి సిరీస్‌పై మరింత పట్టు సాధించాలని చూస్తోంది. విజయ ఉత్సాహంలో ఉన్న భారత జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి రానున్నాడు.

వాతావరణ పరిస్థితులు, రవీంద్ర జడేజా బ్యాటింగ్ సామర్థ్యం తొలి రెండు టెస్టులకు అశ్విన్‌ను పక్కనపెట్టేలా చేశాయి. కానీ జడేజా అంచనాలను అందుకోలేదు. తొలి టెస్ట్‌లో 16 ఓవర్లు వేసిన జడేజా ఒక్క వికెట్ తీయకపోగా.. 3.30 చోప్పున పరుగులు ఇచ్చాడు. ఇక రెండో టెస్ట్‌లో 28 ఓవర్లు వేసిన జడ్డు ఒక్క వికెట్ కూడా తీయలేదు. 48 పరుగులిచ్చాడు. దీంతో యాష్ రాక ఖాయంగా కనిపిస్తోంది.

అశ్విన్‌కు అవకాశం

అశ్విన్‌కు అవకాశం

విదేశీ గడ్డలపై నలుగురు పేసర్లు, ఏకైక స్పిన్నర్‌ రూల్‌తో విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇదే ఫార్ములాకు కోహ్లీ కట్టుబడితే.. రవీంద్ర జడేజా స్థానంలో ఆర్ అశ్విన్‌కు అవకాశం దక్కవచ్చు. ఇషాంత్ శర్మ ప్లేస్‌లో శార్దూల్ ఠాకూర్ తిరిగి జట్టులోకి వచ్చే చాన్స్ ఉంది. అయితే శార్దూల్ తొడ కండరాల గాయం నయమైతే ఈ మార్పు జరగనుంది.

ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ మంచి ఫామ్ మీదున్నారు. విమర్శలపాలైన చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు కూడా గాడిలో పడ్డారు. ఇక విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. ఈ ఇద్దరు కూడా పరుగులు చేస్తే.. భారత బ్యాటింగ్‌కు ఎదురేఉండదు. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు.

Story first published: Monday, August 23, 2021, 15:21 [IST]
Other articles published on Aug 23, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+