India vs England రెండో వన్డేకు విరాట్ కోహ్లీ దూరం.. ఎందుకంటే?

లండన్: ఇంగ్లండ్‌తో తొలి వన్డే విజయంతో ఉత్సాహంగా ఉన్న భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్. గజ్జ గాయంతో తొలి వన్డేకు దూరంగా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం జరిగే రెండో వన్డేకూ దూరం కానున్నాడు. గజ్జ గాయం నుంచి అతను ఇంకా కోలుకోలేదని టీమ్ వర్గాలు పేర్కొన్నాయి. ఓ బీసీసీఐ అధికారి ప్రముఖ వార్త సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ విరాట్ కోహ్లీ గాయం నుంచి కోలుకోలేదనే విషయాన్ని వెల్లడించాడు. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తొలి వన్డేకు ముందు మాత్రం కోహ్లీ గైర్హాజరి విషయాన్ని బీసీసీఐ ట్విటర్ వేదికగా వెల్లడించింది. 'విరాట్ కోహ్లీ, అర్షదీప్ సింగ్ తొలి వన్డే సెలెక్షన్‌కు అందుబాటులో లేరు. విరాట్ కోహ్లీ గజ్జ గాయంతో బాధపడుతుంటే.. అర్షదీప్ పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈ ఇద్దరిని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది'అని బీసీసీఐ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
తొలి వన్డే విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న బుమ్రాను కోహ్లీ గాయంపై ప్రశ్నించగా తనకు తెలియదని సమాధానం ఇచ్చాడు. 'చివరి టీ20 మ్యాచ్ నేను ఆడలేదు. కోహ్లీ గాయం గురించి నాకు సమాచారం లేదు. అతని గాయం పరిస్థితి ఏంటో కూడా నాకు తెలియదు. తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి రావాలని మీతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను'అని బుమ్రా తెలిపాడు.
తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో గెలిచిన భారత్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' జస్‌ప్రీత్ బుమ్రా (6/19) సంచలన బౌలింగ్‌కు, మహ్మద్ షమీ (3/31) మెరుపులు కూడా తోడవడంతో మొదట ఇంగ్లండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ జోస్ బట్లర్ (30; 32 బంతుల్లో 6×4) టాప్‌స్కోరర్. అనంతరం కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ (76 నాటౌట్; 58 బంతుల్లో 7×4, 5×6) చెలరేగడం.. మరో ఓపెనర్ ధావన్ (31 నాటౌట్; 54 బంతుల్లో 4×4) కూడా నిలకడగా ఆడడంతో భారత్ 18.4 ఓవర్లలో ఒక్క వికెట్టూ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. భారత పేసర్లు విజృంభించిన పిచ్ మీద ఇంగ్లిష్ బౌలర్లను అసలేమాత్రం లెక్క చేయలేదు రోహిత్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications