IND vs ENG: ప్చ్.. హాఫ్ సెంచరీతోనే సరిపెట్టిన కోహ్లీ.. పీకల్లోతు కష్టాల్లో భారత్!

ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ(96 బంతుల్లో 8 ఫోర్లతో 50) వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని జోరు కనబర్చిన విరాట్.. ఓలీ రాబిన్సన్ బౌలింగ్‌లో క్యాచ్‌గా వెనుదిరిగాడు. అతను వేసిన 43వ ఓవర్ ఐదో బంతిని అంచనా వేయలేకపోయిన కోహ్లీ మూల్యం చెల్లించుకున్నాడు. ఎక్స్‌ట్రా బౌన్స్ అయిన బంతి కోహ్లీ బ్యాట్‌ను ముద్దాడుతూ కీపర్ బెయిర్ స్టో చేతిలో పడింది. ఈ సిరీస్‌లో రాబిన్సన్ బౌలింగ్‌లో విరాట్ ఔటవ్వడం ఇది మూడోసారి. దాంతో భారత్ 105 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో రహానే(5 బ్యాటింగ్), రిషభ్ పంత్(0 బ్యాటింగ్) ఉన్నారు.

హాఫ్ సెంచరీ చేసి..
అంతకుముందు గత మ్యాచ్ ఫామ్‌ను కొనసాగిస్తూ.. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కోహ్లీ 27 టెస్ట్ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అండర్సన్ వేసిన 40వ ఓవర్‌లో ఫోర్, క్విక్ సింగిల్‌తో 85 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో కోహ్లీకి ఇది రెండో హాఫ్ సెంచరీ కాగా..ఇంగ్లండ్‌పై ఏడోది. ఈ సిరీస్‌లో పూర్తిగా తడబడిన కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో మాత్రం చాలా స్వేచ్చగా బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్ల వేసిన ఫుల్లర్ లెంగ్త్ బాల్స్‌ను చూడముచ్చటైన కవర్ డ్రైవ్స్‌తో బౌండరీలకు తరలించాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలమైన పిచ్‌పై తనదైన బ్యాటింగ్‌తో చెలరేగాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును నిలబెట్టే ప్రయత్నం చేసాడు. 28 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ తనదైన ఇన్నింగ్స్‌తో జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేసాడు. ఓవైపు చతేశ్వర్ పుజారా, జడేజా త్వరగా ఔటైనా.. అజింక్యా రహానేతో కలిసి పోరాడాడు. సెంచరీ చేస్తాడా? అని అనుకుంటున్న తరుణంలో రాబిన్సన్ కోహ్లీని మరోసారి కుదురుకున్నాక ఔట్ చేసి దెబ్బతీశాడు.

జోరూట్జోరూట్ జారవిడిచినా.. జారవిడిచినా..
ఇక లంచ్ బ్రేక్ తర్వాత క్రిస్ వోక్స్‌లో విరాట్ కోహ్లీ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను స్లిప్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ జారవిడిచాడు. వోక్స్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను కోహ్లీ ఫ్లిక్ చేయబోగా.. ఎడ్జ్ తీసుకున్న బంతి జోరూట్ వైపు దూసుకెళ్లింది. అయితే చివరి క్షణంలో బంతి తన గమనాన్ని మార్చుకోవడంతో జోరూట్ అందుకోలేకపోయాడు. అతను కొంత ఆలస్యంగా స్పందించడం కూడా విరాట్‌కు కలిసొచ్చింది. ఈ అవకాశంతో మరింత ఆత్మవిశ్వాసంగా ఆడిన కోహ్లీ ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఆడుతూ హాఫ్ సెంచరీ బాదాడు. కానీ రాబిన్సన్ బౌలింగ్‌లో మాత్రం విరాట్ తప్పించుకోలేకపోయాడు.

ఓపెనర్లు విఫలం..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ తన ఫస్ట్ ఓవర్‌లోనే రోహిత్ శర్మ(11)ను పెవిలియన్ చేర్చాడు. ఎక్స్‌ట్రా బౌన్స్‌తో క్రీజులో కుదురుకుంటున్న హిట్ మ్యాన్‌ను బొల్తా కొట్టించాడు. దాంతో 28 రన్స్‌కే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత పుజారా క్రీజులోకి రాగా.. ఆ వెంటనే కేఎల్ రాహుల్(17)ను రాబిన్సన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. రాబిన్సన్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను తప్పుగా అంచనా వేసిన రాహుల్ మూల్యం చెల్లించుకున్నాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ క్రీజులోకి రాగా.. పుజారా డిఫెన్స్‌కు పరిమితమయ్యాడు. జిడ్డు బ్యాటింగ్‌తో ఇక క్రీజులో పాతుకుపోతున్న పుజారాను అండర్సన్ తనదైన బౌలింగ్‌తో బోల్తాకొట్టించాడు.

పక్కా వ్యూహంతో..
దాంతో టీమిండియా మేనేజ్‌మెంట్ లెఫ్టాండర్ రవీంద్ర జడేజాకు ప్రమోషన్ ఇస్తూ బ్యాటింగ్ పంపించింది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌తో కోహ్లీ, జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి ఫస్ట్ సెషన్ ముగించారు. కానీ లంచ్ బ్రేక్ తర్వాత క్రిస్ వోక్స్ మంచి సెటప్‌తో జడేజాను బోల్తా కొట్టించాడు. వ్యూహాత్మకంగా బంతులు సంధించి వికెట్ సాధించాడు. వైవిధ్యమైన బంతులతో జడేజా అయోమయానికి గురిచేసి ఔట్ చేశాడు. అతను వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌ను తప్పుగా అంచనా వేసి మూల్యం చెల్లించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications