Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. సచిన్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై 4వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్‌ను కోహ్లీ అధిగమించాడు. ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఇంగ్లండ్‌పై విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో కలిపి 4000 ప్లస్ రన్స్ చేయగా.. సచిన్ టెండూల్కర్ 3990 రన్స్ చేశాడు.

సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాలపై అంతర్జాతీయ క్రికెట్‌లో మూడువేలకు పైగా పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా కూడా కోహ్లీ నిలిచాడు. ఆస్ట్రేలియాపై 5000 ప్లస్ రన్స్ చేసిన కోహ్లీ.. ఇంగ్లండ్‌పై 4000 ప్లస్ రన్స్, సౌతాఫ్రికాపై 3000 ప్లస్ రన్స్ నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు దేశాలపై 4000 ప్లస్ రన్స్ చేసిన బ్యాటర్‌గా కోహ్లీ రికీ పాంటింగ్ రికార్డ్‌ను సమం చేశాడు.

IND vs ENG Virat Kohli Creates History Becomes the fastest to complete 16k runs in Asia

కోహ్లీ, పాంటింగ్ చెరో మూడు దేశాలపై 4000 ప్లస్ రన్స్ చేయగా.. సచిన్ రెండు దేశాలపై ఈ ఫీట్ సాధించాడు. ఆసియా గడ్డపై మూడు ఫార్మాట్లలో కలిపి అత్యంత వేగంగా 16 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గానూ కోహ్లీ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో సచిన్ రికార్డ్‌ను కోహ్లీ అధిగమించాడు. సచిన్ 353 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధిస్తే.. కోహ్లీ 340 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ(1) వికెట్ ఆదిలోనే కోల్పోయినా.. కోహ్లీ, శుభ్‌మన్ గిల్ ఆచితూచి ఆడుతున్నారు. 51 బంతుల్లో గిల్, 50 బంతుల్లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 18 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది.

Story first published: Wednesday, February 12, 2025, 15:04 [IST]
Other articles published on Feb 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+