IND vs ENG: క్లైవ్ లాయిడ్ రికార్డు బ్రేక్.. కెప్టెన్‌గా కోహ్లీ మరో అరుదైన ఘనత! స్టీవ్ వా రికార్డుపై కన్ను!!

లండన్: ఐదవ రోజైన సోమవారం అదరగొట్టిన భారత్ లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 'డ్రా'నే లక్ష్యంగా, ప్రతికూల పరిస్థితుల్లో సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 181/6తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్.. ఎవరూ ఊహించని స్కోరు సాధించి ఆతిథ్య జట్టు పోరాడాల్సిన పరిస్థితిని కల్పించింది.
బ్యాట్‌తో మొహ్మద్ షమీ (56 నాటౌట్; 70 బంతుల్లో 6×4, 1×6), జస్ప్రీత్ బుమ్రా (34 నాటౌట్; 64 బంతుల్లో 3×4) అసాధారణ పోరాటంతో భారత్.. 298/8 వద్ద డిక్లేర్ చేసింది. ఆపై మొహ్మద్ సిరాజ్ (4/32), బుమ్రా (3/33), ఇషాంత్ శర్మ (2/13) చెలరేగడంతో ఛేదనలో ఇంగ్లండ్ 51.5 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌట్ అయింది.

క్లైవ్ లాయిడ్ రికార్డు బ్రేక్
రెండో టెస్టులో భారత్ విజయం సాధించడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఘనత చేరింది. టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న నాలుగో కెప్టెన్‌గా నిలిచాడు. కోహ్లీ 63 టెస్ట్ మ్యాచులో 37 విజయాలు అందుకున్నాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ మాజీ సారథి క్లైవ్ లాయిడ్‌ను అధిగమించాడు. లార్డ్స్ టెస్టుకు ముందు వరకు 36 టెస్ట్ విజయాలతో కోహ్లీ లాయిడ్ సమానంగా ఉన్నారు. ఇప్పుడు లాయిడ్‌ను కోహ్లీ వెనక్కినెట్టేశాడు. ఇక టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. స్మిత్ 109 మ్యాచుల్లో 53 విజయాలు అందుకున్నాడు.

భారత్ తరఫున అత్యధిక టెస్ట్ విజయాలు
టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న రెండో కెప్టెన్‌గా రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) ఉన్నాడు. పాంటింగ్ 77 మ్యాచుల్లో 48 విజయాలు అందుకున్నాడు. మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ వా 57 మ్యాచుల్లో 41 విజయాలు ఖాతాలో వేసుకున్నాడు. ఇక భారత్ తరఫున అత్యధిక టెస్ట్ విజయాలు సాధించింది విరాట్ కోహ్లీనే. రెండో స్థానంలో ఉన్న ఎంఎస్ ధోనీ 60 మ్యాచుల్లో 27 విజయాలు అందుకున్నాడు. మూడో స్థానంలో ఉన్న సౌరవ్ గంగూలీ 49 మ్యాచుల్లో 21 విజయాలు అందుకున్నాడు. మొహ్మద్ అజారుద్దీన్ (14), సునీల్ గవాస్కర్ (9), ఎంకే పటౌడీ (9)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

కపిల్, ధోనీ తర్వాత
లార్డ్స్ మైదానంలో టెస్టు మ్యాచ్ గెలిచిన మూడో భారత సారథిగా కూడా విరాట్ కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు 1986లో కపిల్ దేవ్, 2014లో ఎంఎస్ ధోనీ మాత్రమే ఈ మైదానంలో టెస్టు విజయాలను అందుకున్నారు. లార్డ్స్ విజయంతో సేన (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో కోహ్లీ విజయాలు అందుకున్నాడు.
సేన దేశాల్లో అత్యధిక విజయాలు అందుకున్న ఆసియా కెప్టెన్‌గా మరో సరికొత్త చరిత్ర లిఖించాడు. టెస్టుల్లో టాస్ ఓడిపోయిన తర్వాత మ్యాచ్ గెలవడం కోహ్లీకి ఇది ఆరోసారి. సౌరవ్ గంగూలీ ఐదు సార్లు, ఎంఎస్ ధోనీ నాలుగుసార్లు ఈ ఫీట్ సాధించారు. కోహ్లీ ఇప్పటికే వ్యక్తిగతంగా, సారథిగా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.

రెండో భారత బౌలర్‌గా సిరాజ్ రికార్డు
లార్డ్స్ టెస్టులో 8 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా మహ్మద్ సిరాజ్ రికార్డు క్రియేట్ చేశాడు. 1982లో అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ ఈ రికార్డు క్రియేట్ చేయడం విశేషం.కపిల్ దేవ్ 168 పరుగులిచ్చి 8 వికెట్లు తీయగా.. 126 పరుగులకే 8 వికెట్లు తీసిన సిరాజ్.. లార్డ్స్ టెస్టులో భారత్ తరుపున అత్యుత్తమ గణాంకాలు నమోదుచేసిన బౌలర్‌గా నిలిచాడు. భారత స్పిన్నర్లు వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం ఇది రెండోసారి. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా ఎంట్రీ ఇచ్చిన మొదటి రెండు మ్యాచుల్లో భారత స్పిన్నర్లు ఉన్నా వారికి వికెట్లు దక్కలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
మీరు ఒకరి వెంటపడితే.. మేం 11 మందిమి మీ వెంటపడతాం! ఇంగ్లండ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేఎల్ రాహుల్!