
బీసీసీఐ వార్నింగ్..
అయితే ఈ పర్యటనకు సిద్దమైన రవిచంద్రన్ అశ్విన్ కరోనా కారణంగానే చివరినిమిషంలో తప్పుకోగా.. గత శనివారం కెప్టెన్ రోహిత్ శర్మ వైరస్ బారిన పడ్డాడు. అయినా భారత ఆటగాళ్లు మాత్రం ఎలాంటి భయం లేకుండా స్వేచ్చగా లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. అభిమానులకు సెల్ఫీలు ఇస్తూ సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐ ఆటగాళ్లందరికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఆటగాళ్లు బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదని, తమ హ్యాంగ్‌అవుట్‌లను పరిమితం చేసుకుని తమకు కేటాయించిన హోటల్లోనే బస చేయాలని స్పష్టం చేసింది.

లైట్ తీసుకున్న కోహ్లీ గ్యాంగ్..
ఓవైపు కెప్టెన్ కరోనా బారిన పడి ఐసోలేషన్‌లో ఉండగా మరోవైపు భారత ఆటగాళ్లు మాత్రం రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతూ.. కనబడిన ప్రతీ అభిమానికి సెల్ఫీలు ఇస్తున్నారు. బీసీసీఐ వార్నింగ్ ఇచ్చినా లెక్క చేయకుండా ఎంజాయ్ చేస్తున్నారు. బోర్డు ఆదేశాలతో పాటు కరోనా వైరస్‌ను లైట్ తీసుకుంటున్నారు. సోమవారం ఉదయమే బీసీసీఐ వార్నింగ్ ఇవ్వగా.. రాత్రి బర్మింగ్‌హామ్‌లో ఓ రెస్టారెంట్‌లో భారత ఆటగాళ్లు డిన్నర్ చేసి సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అవసరం లేకున్నా..
'ఇంగ్లండ్ పర్యటనలోని ఆటగాళ్లు బహిరంగంగా తిరుగుతున్నారు. వారు తమ అలవాటును మార్చుకోవాలని హెచ్చరించాం. కొంతమంది ప్లేయర్లు మాస్క్‌లు లేకుండా పబ్లిక్‌గా వెళ్లి అభిమానులతో ఫొటోలు దిగుతున్నారు. ఇలాంటి పనులు కోవిడ్ వ్యాప్తికి కారణమవుతాయి. ఈ క్రమంలోనే ప్లేయర్లంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పాం. వారు బస చేసిన హోటల్లోనే ఉండాలని సూచించాం. కానీ వారు మాత్రం అవసరం లేకున్నా పలు ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఈ విషయంలో బోర్డు చాలా ఆగ్రహంగా ఉంది' అని ఓ బీసీసీఐ అధికారి ఏఎన్‌ఐకి తెలిపాడు.
జూలై 1 నుంచి..
లీసెస్టర్‌షైర్‌తో జరిగిన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. జూలై 1 నుంచి గతేడాది మిగిలిపోయిన ఈ ఏకైక టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. చివరి మ్యాచ్ గెలిచినా.. డ్రా చేసుకున్నా సిరీస్ భారత్‌దే అవుతోంది. అయితే రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. అతనికి రిప్లేస్‌మెంట్‌గా మయాంక్ అగర్వాల్‌ను టీమ్‌మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది. రోహిత్ గైర్హాజరీలో జస్‌ప్రీత్ బుమ్రా జట్టును నడిపించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications
