IND vs ENG: ఇదెక్కడి దరిద్రం అయ్యా.. వరుణ్ చక్రవర్తీ!
ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ ఓ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో 10 వికెట్లను పడగొట్టి పలు రికార్డులను తన పేరిటి లిఖించుకున్న వరుణ్ చక్రవర్తీ.. ఓ అప్రతిష్టను కూడా మూటగట్టుకున్నాడు.
వరుణ్ చక్రవర్తీ అసాధారణ బౌలింగ్‌తో పాటు యువ బ్యాటర్ల సంచలన బ్యాటింగ్‌తో తొలి రెండు టీ20ల్లో గెలిచిన టీమిండియా.. మూడో మ్యాచ్‌లో మాత్రం ఓటమిపాలైంది. రాజ్‌కోట్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తీ(5/24) ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.

అంతర్జాతీయ టీ20ల్లో వరుణ్ చక్రవర్తీకి ఇది రెండో ఐదు వికెట్ల ఘనత. అయితే ఈ రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఓడిపోవడం గమనార్హం. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో రెండు ఓటముల్లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న బౌలర్‌గా వరుణ్ చక్రవర్తీ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.
గతేడాది సౌతాఫ్రికా పర్యటనలోనూ వరుణ్ చక్రవర్తీ 5 వికెట్ల ఘనతను అందుకోగా.. ఆ మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమిపాలైంది. భారత్ గత 31 టీ20ల్లో మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమిపాలైంది. అందులో వరుణ్ చక్రవర్తీ ఐదు వికెట్ల ఘనతను అందుకున్న రెండు మ్యాచ్‌లు ఉండటం గమనార్హం. దాంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. మరోసారి 5 వికెట్ల ఘనతను అందుకోవద్దని రిక్వెస్ట్ చేస్తూ సెటైర్లు పేల్చుతున్నారు. 'ఇదెక్కడి దరిద్రం అయ్యా.. వరుణ్ చక్రవర్తీ'అని పోస్ట్‌లు పెడుతున్నారు.
మూడో టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. బెన్ డకెట్(28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. లియామ్ లివింగ్‌స్టోన్(24 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 43) ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(5/24) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. హార్దిక్ పాండ్యా(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసి ఓటమిపాలైంది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(35 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 40), అభిషేక్ శర్మ(14 బంతుల్లో 5 ఫోర్లతో 24) మినహా అంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ రెండేసి వికెట్లు తీయగా.. జామీ ఓవర్టన్ మూడు వికెట్లు పడగొట్టాడు. మార్క్ వుడ్‌కు ఓ వికెట్ దక్కింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-2తో నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications