
అసలు రూల్ ఏంటంటే..
క్రికెట్ నిబంధనలను రూపొందించే ఎంసీసీ రూల్స్ ప్రకారం వికెట్ కీపింగ్ గ్లోవ్స్‌కు టేప్ వేయకూడదు. ముఖ్యంగా చూపుడు వేలు, బొటన వేలు మినహాయించి ఇతర వేళ్ల మధ్య వెబ్బింగ్ చేయకూడదు. అలా చేస్తే కీపర్‌కు అడ్వాంటేజ్‌గా ఉంటుంది. కానీ రిషభ్ పంత్ మాత్రం తన వేళ్లకు టేప్ చుట్టుకోవడంతో అంపైర్ అలెక్స్ వార్ఫ్.. రిషభ్ పంత్‌ను మందలించి నిబంధనలకు విరుద్దమని చెప్పాడు.
దాంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ ఆ టేపును తొలగించారు. ఎంసీసీ 27.2.1 నిబంధన ప్రకారం రిషభ్ పంత్ చేసినది తప్పు. కీపింగ్ గ్లోవ్స్‌లో బొటన వేలు, చూపుడు వేలు మధ్య మినహా మిగతా వేళ్ల మధ్య ఉబ్బేలా, ఎత్తుగా ఏది పెట్టుకోకూడదు. గ్లోవ్స్‌ను కూడా అలా తయారు చేయవద్దు.

డేవిడ్ మలాన్ నాటౌట్ అంటూ..
మైదానంలో ఈ ఘటనను కామెంటేటర్ నాసర్ హుస్సేన్ వివరించాడు. థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్ వర్త్.. రిషభ్ పంత్ వెబ్బింగ్ చేసినట్లు గుర్తించాడని వెంటనే ఫీల్డ్ అంపైర్లకు సమాచారం ఇచ్చి ఆ టేపును తొలగించేలా చేశాడని చెప్పాడు. వెబ్బింగ్ సంబంధించి అనేక నిబంధనలు ఉన్నాయన్నాడు.
సిరాజ్ వేసిన 94 ఓవర్‌లో డేవిడ్ మలాన్ ఔటైన వెంటనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో అతన్ని వెనక్కి రప్పించాలని మరో కామెంటేటర్ డేవిడ్ లాయడ్ డిమాండ్ చేశాడు. నిబంధనలకు విరుద్దంగా రిషభ్ పంత్ వ్యవహరించాడని, మలాన్ కీపర్ క్యాచ్‌గా ఔటయ్యాడు కాబట్టి అతన్ని వెనక్కిరప్పించాలన్నాడు. నాసర్ హుస్సేన్ మాత్రం లాయడ్ వ్యాఖ్యలతో ఏకీభవించలేదు.

పట్టుబిగించిన ఇంగ్లండ్..
తొలి ఇన్నింగ్స్‌లో చెత్త బ్యాటింగ్‌తో టీమిండియా 78 పరుగులకే కుప్పకూలగా.. ఇంగ్లండ్ మాత్రం దుమ్ము రేపింది. వాళ్ల ఆటతీరు బంతి నుంచి బ్యాట్‌కు బదిలీ అయింది తప్ప ఆడిన తీరు, క్రీజులో జోరు ఏమాత్రం తగ్గలేదు. పరుగుల హోరు ఆగలేదు. బ్యాటింగ్ వరుసలో టాపార్డర్ 'టాప్' ప్రదర్శన చేసింది. కెప్టెన్ జో రూట్ (165 బంతుల్లో 14 ఫోర్లతో 121) మరో శతకంతో చెలరేగగా, డేవిడ్ మలాన్ (128 బంతుల్లో 11 ఫోర్లతో 70) అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 129 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది.

432 ఆలౌట్..
423/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 9 పరుగులు జత చేసి కుప్పకూలింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ర క్రైగ్ ఓవర్టన్(32)8 పరుగులు జత చేసి మహమ్మద్ షమీ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోగా.. మరో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ ఓలీ రాబిన్సన్‌ను జస్‌ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు.
దాంతో ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 432 పరుగుల వద్ద ముగిసింది. రూట్ సేన 354 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో షమీ 4, జడేజా, సిరాజ్, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. నిలకడగా ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి నుంచి గట్టెక్కాలంటే 650 ప్లస్ పరుగులు చేయాలి. లేదా వర్షంతో కనీసం రెండు సెషన్ల ఆటనైనా తుడిచిపెట్టుకుపోవాలి.


Click it and Unblock the Notifications
