For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: నకరాలు చేయకుండా నోరు మూసుకోని బ్యాటింగ్ చేయ్.. బ్రాడ్‌కు అంపైర్ చివాట్లు! (వీడియో)

IND vs ENG: Umpire Richard Kettleborough Says SHUT UP To Stuart Broad During 5th Test Match

బర్మింగ్‌హామ్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రిషెడ్యూల్ ఐదో టెస్ట్‌ రసవత్తరంగా మారింది. మూడు రోజుల పాటు బ్యాట్, బాల్‌తో సత్తా చాటి డ్రైవింగ్ సీట్‌లో ఉన్న టీమిండియా.. నాలుగో రోజు తేలిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమై ఓటమి ముంగిట నిలుచుంది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మూడో రోజు ఆటలో భాగంగా చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించిన స్టువర్ట్ బ్రాడ్‌‌ను ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో మందలించాడు. నోరు మూసుకొని బ్యాటింగ్ చేయాలని చివాట్లు పెట్టాడు.

అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ బ్రాడ్ వాగ్వాదానికి దిగడంతో ఆగ్రహానికి గురైన కెటిల్ బారో చివాట్లు పెట్టాడు. ఈ వ్యాఖ్యలు కాస్త స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. 'మమల్ని అంపైరింగ్ చేయనివ్వు. లేకుంటే నీవు మళ్లీ సమస్యల్లో పడుతావు. బ్రాడీ నకరాలు చేయకుండా నోరు మూసుకొని బ్యాటింగ్'చేయ్ అని కెటిల్ బరో అనడం స్టంప్ మైక్‌లో స్పష్టంగా రికార్డు అయ్యింది. అయితే అంపైర్ తీరును కొందరు తప్పుబడుతుండగా మరికొందరు మాత్రం బ్రాడ్‌ది తప్పుంటున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇలా నోరుమూసుకోమని చెబుతారా? అని ప్రశ్నిస్తున్నారు.

భారత్ విధించిన 378 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 259 పరుగులు చేసింది. ఓపెనర్లు అలెక్స్ లీస్(65 బంతుల్లో 8 ఫోర్లతో 56), జాక్ క్రాలీ(76 బంతుల్లో 7 ఫోర్లు 46) 107 పరుగుల భాగస్వామ్యాన్ని అందించగా.. జానీ బెయిర్ స్టో(72 బ్యాటింగ్), జోరూట్(76 బ్యాటింగ్) అజేయ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో భారత బౌలర్లు తేలిపోయారు. బుమ్రా(2/52) మినహా మరెవరూ ఒక్క వికెట్ తీయలేకపోయారు. వికెట్ సైతం పూర్తిగా ఫ్లాట్‌గా మారడం ఇంగ్లండ్ బ్యాటర్లకు కలిసొచ్చింది. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 119 పరుగులు అవసరమవ్వగా.. భారత్‌కు ఏడు వికెట్లు కావాలి. ఆట చివరి రోజు మంగళవారం ఫస్ట్ సెషన్ ఆట‌లో మ్యాచ్ ఫలితం తేలనుంది.‌

సంక్షిప్త స్కోర్లు..

భారత్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్(రిషభ్ పంత్ 146, రవీంద్రజడేజా 104, జేమ్స్ అండర్సన్ 5/60)

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్(జానీ బెయిర్ స్టో 106, సామ్ బిల్లింగ్స్ 36, మహమ్మద్ సిరాజ్ 4/66)

భారత్ రెండో ఇన్నింగ్స్ 245 ఆలౌట్( పుజారా 66, రిషభ్ పంత్ 57, బెన్ స్టోక్స్ 4/33)

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ : 57 ఓవర్లలో 259/3 (బెయిర్ స్టో 72 బ్యాటింగ్, జోరూట్ 76 బ్యాటింగ్)

Story first published: Tuesday, July 5, 2022, 12:22 [IST]
Other articles published on Jul 5, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+