IND vs ENG: ముగిసిన తొలి రోజు ఆట.. ఇంగ్లండ్‌దే జోరు.. చివర్లో చెలరేగిన భారత్!

ఓవల్: భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ పై చేయి సాధించింది. ముందుగా భారత్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసిన ఆతిథ్య జట్టు.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఆ జోరును కొనసాగించలేకపోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో 3 వికెట్లకు 53 రన్స్ చేసింది. క్రీజులో డేవిడ్ మలాన్(26 బ్యాటింగ్)తో పాటు నైట్ వాచ్‌మన్ క్రైగ్ ఓవర్టన్(1 బ్యాటింగ్) ఉన్నాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు. భారత్ కన్నా ఇంగ్లండ్ ఇంకా 138 పరుగుల వెనుకంజలో ఉంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు కుప్పకూలింది. శార్దూల్ ఠాకూర్(36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57), విరాట్ కోహ్లీ(96 బంతుల్లో 8 ఫోర్లతో 50) మినహా అంతా దారుణంగా విఫలమయ్యారు. 127 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును శార్దూల్ ఠాకూర్ తన ధనాధన్ ఇన్నింగ్స్ ఆదుకున్నాడు. ఉమేశ్ యాదవ్(10)తో కలిసి 8వ వికెట్‌కు 63 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్(4/55), ఓలి రాబిన్సన్(3/38) భారత్ పతనాన్ని శాసించగా.. జేమ్స్ అండర్సన్, క్రైగ్ ఓవర్టన్ చెరొక వికెట్ తీశారు.

చేతులెత్తేసిన ఓపెనర్లు..
ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ తన ఫస్ట్ ఓవర్‌లోనే రోహిత్ శర్మ(11)ను పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే కేఎల్ రాహుల్(17)ను రాబిన్సన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. రాబిన్సన్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను తప్పుగా అంచనా వేసిన రాహుల్ మూల్యం చెల్లించుకున్నాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది.
దాంతో భారత్ 28 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ క్రీజులోకి రాగా.. పుజారా డిఫెన్స్‌కు పరిమితమయ్యాడు. జిడ్డు బ్యాటింగ్‌తో క్రీజులో పాతుకుపోతున్న పుజారాను అండర్సన్ తనదైన బౌలింగ్‌తో బోల్తాకొట్టించాడు. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌తో కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.

జడేజాకు ప్రమోషన్..
ఈ పరిస్థితుల్లో టీమిండియా మేనేజ్‌మెంట్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. లెఫ్టాండర్ రవీంద్ర జడేజాకు ప్రమోషన్ ఇస్తూ అప్‌ది ఆర్డర్ బ్యాటింగ్‌కు పంపించింది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌తో కోహ్లీ, జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి ఫస్ట్ సెషన్ ముగించారు. కానీ లంచ్ బ్రేక్ తర్వాత క్రిస్ వోక్స్ మంచి సెటప్‌తో జడేజాను బోల్తా కొట్టించాడు.
వ్యూహాత్మకంగా బంతులు సంధించి వికెట్ సాధించాడు. అతను వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌ను తప్పుగా అంచనా వేసిన జడేజా మూల్యం చెల్లించుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి రహానే రాగా.. అండర్సన్ వేసిన 40వ ఓవర్‌లో కోహ్లీ ఓ ఫోర్, క్విక్ సింగిల్‌తో 85 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో కోహ్లీకి ఇది రెండో హాఫ్ సెంచరీ కాగా..ఇంగ్లండ్‌పై ఏడోది. ఓవరాల్‌గా 27వ టెస్ట్ హాఫ్ సెంచరీ.

ప్చ్.. రహానే, పంత్ మళ్లీ..
ఇక సెంచరీ చేయడం పక్కా అని అందరు అనుకుంటున్న తరుణంలో ఓలీ రాబిన్సన్ దెబ్బతీశాడు. ఎక్స్‌ట్రా బౌన్స్‌తో కోహ్లీని కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ 105 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ కొద్దిసేపటికే ఓవర్టన్ బౌలింగ్‌లో రహానే(14).. స్లిప్‌లో మొయిన్ అలీ సూపర్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. పంత్ కూడా ఔటవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేననుకున్నారు.
కానీ శార్దూల్.. ఉమేశ్‌తో కలిసి గట్టెక్కించాడు. అసలు సిసలు బ్యాట్స్‌మన్‌లా చెలరేగాడు. స్వేచ్చగా భారీ షాట్లు ఆడాడు. అయితే అతను ఔటైన తర్వాత బుమ్రా రనౌటవ్వగా.. ఉమేశ్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.

ఇంగ్లండ్‌కు బుమ్రా స్ట్రోక్..
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు జస్‌ప్రీత్ బుమ్రా ఆదిలోనే గట్టిషాక్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో ఆ జట్టు ఓపెనర్లు రోరీ బర్న్స్(5), హసీబ్ అహ్మద్(0)లను పెవిలియన్ చేర్చాడు. ముందుగా రోరీ బర్న్స్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా.. హసీబ్ అహ్మద్‌ను ఎక్స్‌ట్రా బౌన్సర్లతో కీపర్ క్యాచ్‌గా వెనక్కిపంపాడు. దాంతో ఇంగ్లండ్ 6 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో జోరూట్(21), డేవిడ్ మలాన్(26 బ్యాటింగ్) ధనాధన్ షాట్లతో స్కోర్ బోర్డును పరుగెత్తించారు. పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడంతో స్వేచ్చగా బ్యాటింగ్ చేశారు. 46 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో కుదురుకుపోయిన ఈ జోడీని.. ఉమేశ్ యాదవ్ అద్భుత బంతితో విడదీశాడు. జోరూట్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో క్రీజులోకి ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్‌గా క్రైగ్ ఓవర్టన్ రాగా.. అతను పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమై మరో వికెట్ పడకుండా తొలి రోజు ఆటను ముగించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications